క్రీడాభూమి

మీరు ఆడితేనే మేం ఆడతాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జనవరి 25: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చీఫ్ ఎగ్జిక్యూటీవ్ వసీం ఖాన్ శనివారం సంచలన ప్రకటన చేశాడు. పాకిస్తాన్‌లో సెప్టెంబర్‌లో జరిగే ఆసియా కప్ టీ20లో భారత జట్టు పాల్గొనకపోతే 2021లో భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడేందు కు తాము కూడా సిద్ధంగా లేమని స్పష్టం చేశాడు. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటిస్తే ఆసియా కప్ ఆతిథ్య హక్కులను బదిలీ చేస్తామని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదని, ప్రస్తుతం తాము ఆసియా కప్ నిర్వహణకు వేది కలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయతే పాకిస్తాన్‌లో ఆడాలా లేదా అనే విషయమై భారత్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. 2020 సెప్టెంబర్‌లో ఆసియా కప్‌ను పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తే, టీ20 ప్రపంచకప్ 2021 భారత్‌లో జరగనుంది.