క్రీడాభూమి

విజయంపై కివీస్ కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆక్లాండ్: వరుస పరాజయాలు కివీస్ జట్టుకు నిద్రపట్టనీయడం లేదు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆసిస్‌తో సిడ్నీ వేదికగా జరిగిన చివరి (మూడో) టెస్టులో పరాజయంతో ప్రారంభించింది. ఆ తర్వాత టీమిండియాతో సుదీర్ఘ పర్యటన లో ఆ మరకను చెరిపేసుకుందామనుకున్నా న్యూజిలాండ్ క్రికె ట్ జట్టు కల నెరవేరేలా కనిపించడం లేదు. గత శుక్రవారం భా రత జట్టుతో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ 203 పరుగు లు చేసినా, అది కాపాడుకో వడంలో విఫలమైంది. ఫలితంగా భారత్ 6 వికెట్ల తేడా తో విజయం సాధించింది.
దీంతో కివీస్ ఎలాగైనా టీమిండియాను ఓడించాలనే కసితో కనిపిస్తోంది.
బౌలర్లే కారణం?
గత మ్యాచ్ లో న్యూజిలాండ్ ఓటమికి పూర్తిగా బౌలర్లే కారణమనే చెప్పాలి. జట్టు 203 పరుగులు చేసినా, సినీయర్ బౌలర్లు టిమ్ సౌథీ (48), మిచెల్ శాంత్నార్ (50) పరుగులకు పైగా సమర్పించుకున్నారు. ఐదుగురు బౌలర్ల ఏకనామీ 9 దాటిందంటే ఎంత చెత్తగా బౌలింగ్ చేశారో అర్థమవుతోంది. ఇక బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్, కొలిన్ మున్రోతో పాటు మూడో స్థానంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్, మిడిలార్డర్‌లో సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ఫాంలో ఉండ డం న్యూజిలాండ్ జట్టుకు కలిసొచ్చే అంశం. అయతే ఆల్‌రౌండర్ కొలిన్ డీగ్రాండ్ హోం, వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ గత మ్యాచ్‌లో తక్కువ స్కోర్లకే పెవిలియ న్ చేరడం కాస్త నిరాశ పరిచే అంశమే.
దూకుడుగా టీమిండియా..
మరోవైపు వరుస విజయాలతో దూకుడుగా కనిపిస్తున్న కోహ్లీసేనను న్యూజిలాండ్ అడ్డుకోవడం దాదాపు కష్టంగానే కనిపిస్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రా ణించిన టీమిండియా మూడు వనే్డల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న విషయం తెలిసిందే. తాజాగా న్యూజిలాండ్ పర్య టనలోనూ మొదటి మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని కూడా ఈజీగానే ఛేదించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీకి తోడు, కేఎల్ రాహుల్, శ్రే యాస్ అయ్యర్, మనీష్ పాండే అద్భుత ఫాంలో ఉండడంతో భారత్ బ్యాటింగ్ లైనప్ బలంగా కనిపిస్తోంది. ఇక ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్‌లో రాణించిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ తొ లి మ్యాచ్‌లో నిరాశ పరిచాడు. అయతే రోహిత్ ఫాంలోకి వస్తే మాత్రం భారత్‌ను అడ్డుకోవడం మాత్రం కివీస్‌కు కష్టమే. ఇక బౌలింగ్ విషయంలో స్వల్ప మార్పులు చోటుచేసుకునే అవకా శం కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో శార్దుల్ ఠాకూర్ విఫలమైనా, టీ20 ప్రపంచకప్ దృష్ట్యా మరిన్ని అవకాశాలు కల్పించే అవకాశం ఉండగా, శివమ్ దూబేపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయ. అతడి స్థానంలో నవదీప్ సైనీని తుది జట్టులో చేర్చే అవకాశముంది. ఇక వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌నే కొనసాగించాలని జట్టు మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
టీమిండియా జట్టు (ఫైల్)