క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ క్వార్టర్స్‌కు సైనా, శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూన్ 9: ఈ ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరారు. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న హైదరాబాదీ సైనా 21-12, 21-14 తేడాతో మలేసియా క్రీడాకారిణి జిన్ వెయ్ గోను ఓడించి క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో స్థానం కోసం ఆమె థాయిలాండ్‌కు చెందిన రెండోసీడ్ రచానొక్ ఇంతనాన్‌ను ఢీ కొంటుంది. కాగా, పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్ 21-19, 21-12 ఆధిక్యంతో సోనీ ద్వి కున్కొరోపై గెలిచి, సెమీస్‌లో వాంగ్ హీ హియోతో పోరును ఖరారు చేసుకున్నాడు. సుమారు నెల రోజులు విశ్రాంతి తీసుకున్న అతను రియో ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేందుకు వీలుగా ఈ టోర్నీలో పాల్గొంటున్నాడు. ఇలావుంటే, మహిళల సింగిల్స్‌లో భారత యువ క్రీడాకారిణి తన్వీ లాడ్ ఓటమిపాలైంది. ఆమెపై చైనాకు చెందిన నాలుగో సీడ్ వాంగ్ ఇహాన్ 21-18, 21-9 తేడాతో విజయం సాధించింది.

చిత్రం సైనా నెహ్వాల్