క్రీడాభూమి

గోదావరి ఆర్చరీ అకాడమీకి పతకాల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 28: రాజమహేంద్రవరంలోని గోదావరి ఆర్చరీ అకాడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఆగ్రా నగరంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటారని సంస్థ వ్యవస్థాపకుడు యూఎస్‌ఏ లెవెల్-2 అర్చరీ కోచ్ నాళం దుర్గారామ్‌కుమా ర్ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23 నుంచి 26వ తేదీ వరకు వివిధ విభాగాల్లో అకాడమి క్రీడాకారులు 11 స్వర్ణ, 7 రజత, 5 కాంస్య పతకాలు సాధించారని చెప్పారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు సాధించిన మొత్తం పతకాలు 31 కాగా వాటిలో 23 గోదావరి ఆర్చరీ అకాడమి క్రీడాకారులే గెలుచుకున్నారన్నారు. ఆగ్రా పోటీల్లో తమ అకాడమీ నుంచి మొత్తం 15 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. ఆగ్రా పోటీల్లో సాధించిన స్వర్ణ పతకాల్లో 4 కొప్పాక ప్రభాస్ సాధించగా, సప్పా హిమాంశు అభ్యుద్, మొవ్వా అభిరామ్, కొప్పాక ప్రభాత్, కర్రి బుద్ధేశ్వరరావు, నాళం కార్తికేయ, నాళం జయశృతి, నాళం దుర్గారామ్‌కుమార్‌లు ఒక్కో స్వర్ణ పతకం సాధించారని తెలిపారు. 7 రజత పతకాల్లో జయశృతి 5, కార్తికేయ 1, సూరెడ్డి రోహన్ అక్షయ్ ఒకటి సాధించారన్నారు. 5 కాంస్య పతకాల్లో కార్తికే య 2, వీధి అక్షయ్ నాయుడు, రోహన్ అక్ష య్, బుద్ధేశ్వరావు ఒక్కొక్క పతకాన్ని సాధించారన్నారు.
ఈ నెల 17న కడపలో జరిగిన అండర్-10, 14, 17, సీనియర్స్, వెటరన్ విభాగాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి విలువిద్య పోటీల్లో ప్రతిభ కనపరిచి 8 స్వర్ణ, 10 రజత, 6 కాంస్య పతకాలు సాధించి తమ అకాడమీ క్రీడాకారులు గతంలో జరిగిన పలు పోటీల్లో అనేక పతకాలు సాధించారని రామ్‌కుమార్ చెప్పారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, విలువిద్యపై వారికున్న మక్కువతో అర్చరీ అకాడమిలో అత్యుత్తమ శిక్షణ పొందారన్నారు.
ఈ నెల 29 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీలో జరిగే అండర్-14 జాతీయ స్థాయి పోటీల్లోనూ, వచ్చే నెల 5 నుంచి 9 వరకు బరోడాలో జరిగే మాస్టర్స్ జాతీయ స్థాయి పోటీల్లోనూ తమ అకాడమీ క్రీడాకారులు పాల్గొంటున్నారని రామ్‌కుమార్ తెలిపారు. సమావేశంలో విద్యార్ధుల తల్లిదండ్రులు కొప్పాక మొహర్ చరణ్, కర్రి నాగబాబు, సూరెడ్డి శివకుమార్, సప్పా వెంకట సత్యనారాయణ, మొవ్వా వెంకటరాయుడు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... పతకాలు సాధించిన విద్యార్థులతో కోచ్ దుర్గా రామ్‌కుమార్