క్రీడాభూమి

‘సూపర్’ విన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 లో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఆఖరు బంతిని సిక్సర్‌గా మలిచి టీమిండియాకు ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత విజయాన్ని అందించాడు. అంతకు ముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. గత మ్యాచు ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు. మొదటి బంతి నుంచే న్యూజిలాండ్ బౌలర్ల పై ఓపెనర్లు ఇద్దరూ విరుచుకుపడ్డారు. ఒకానొక దశలో ఓవర్ కు 10 పరుగుల చొప్పున రాబట్టారు. ఈ క్రమంలో కేవలం 23 బంతుల్లోనే రోహిత్ శర్మ (65) సిక్సర్ కొట్టి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మరోవైపు గత రెండు మ్యాచుల్లో అర్ధ సెంచరీలను సాధించిన మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ సైతం దూకుడుగా ఆడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అయతే డీగ్రాండ్ హోం వేసిన 9వ ఓవర్ చివరి బంతికి రాహు ల్ (27) మున్రోకు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 89 పరుగుల విలు వైన భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత మూడో స్థానం లో క్రీజులోకి వచ్చిన యువ ఆటగాడు శివమ్ దూబేతో కలిసి అప్పటి వరకు దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ (65) బెనె్నట్ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి క్రీజు వదిలాడు. అదే ఓవర్ చివరి బంతికి శివమ్ దూబే (3) కూడా అవుట్ కావడంతో భారత్ 96 పరుగులకే 3 వికెట్లు కోల్పోయంది. ఈ క్రమంలో క్రీజులో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ నిలకడ గా ఆడే ప్రయత్నం చేశారు. అప్పటికే సగం ఓవర్లు పూర్తి కావడంతో వీరిద్దరూ వేగంగా పరుగులు రాబట్టే ప్రయత్నం చేశారు. అయతే భారీ షాట్ ఆడే క్రమంలో శ్రేయాస్ అయ్యర్ (17) శాంత్నార్ బౌలింగ్‌లో స్టంప్ అవుట్‌గా వెనుదిరిగాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 46 పరుగులను జోడించా రు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్ పాండే వచ్చీ రావ డంతోనే ఒక బౌండరీ, సిక్సర్ కొట్టి అలరించాడు. ఇదిలా ఉంటే కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ (38) బెనె్నట్ బౌలింగ్‌లో సౌథీ పట్టిన క్యాచ్‌తో క్రీజు వదిలాడు. ఇక చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (10, నాటౌ ట్) ఐదో బంతిని సిక్సర్ కొట్టి, చివరి బంతికి సింగిల్ తీయ డంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయ 179 పరు గులు చేసింది. 4 ఓవర్లు వేసి 54 పరుగులు సమర్పించుకున్న హమీష్ బెనె్నట్‌కు 3 వికెట్లు దక్కగా, మిచెల్ శాంత్నార్, కొలిన్ డీగ్రాండ్ హోం ఒక్కో వికెట్ పడగొట్టారు.
దీటుగా స్పందించిన కివీస్..
లక్ష్య ఛేదనకు న్యూజిలాండ్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. మొదటి నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దాడికి దిగింది. అయతే రవీంద్ర జడేజా వేసిన 6వ ఓవర్‌లో నాలుగో బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ముందుకొచ్చి ఆడిన కొలిన్ మున్రో (14)ని రాహుల్ స్టంప్ అవుట్ చేయడంతో కివీస్ 47 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయంది. ఆ తర్వాత క్రీజు లోకి వచ్చిన కెప్టెన్ విలియ మ్సన్ మొదటి బంతి నుంచే ఆకాశ మే హద్దుగా చెలరేగి ఆడాడు. అయతే కొద్దిసేపటికే మార్టిన్ గుప్టిల్ (31)ని శార్దుల్ ఠాకూర్ పెవిలి యన్‌కు పంపడంతో కివీస్ 52 పరుగులకు ఓపెనర్లిద్దరినీ కోల్పోయంది.
ఓవైపు వికెట్లు.. మరోవైపు బౌండరీలు..
ఇదిలాఉంటే కెప్టెన్ విలియమ్సన్ భారత బౌలర్లను లక్ష్యంగా చేసుకొని బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయతే మిచెల్ శాంతార్న్ (9) చాహల్‌కు వికెట్లు ముం దు దొరికిపోయాడు. దీంతో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ కొలిన్ డీగ్రాండ్ హోం సహకారంతో 28 బంతుల్లోనే విలియమ్సన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా, శార్దుల్ ఠాకూర్ వేసిన అద్భుత డెలివరీకి డీగ్రాండ్ హోం (5) పెవిలియన్‌కు చేరాడు. 137 పరుగులకే 4 కీలక వికెట్లను కోల్పోయనా, కెప్టెన్ విలియమ్సన్ మాత్రం తన దూకుడును తగ్గించుకోలేదు. సీనియర్ ఆల్ రౌండర్ రాస్ టేలర్‌తో కలిసి తనదైన శైలిలో ముందుకు సాగాడు.
షమీ సూపర్ స్పెల్..
కివీస్ విజయానికి చివరి ఓవర్‌లో 9 పరుగులు అవసరం. కెప్టెన్ కోహ్లీ సినీయర్ బౌలర్ మహ్మద్ షమీ చేతికి బంతిని అందించాడు. దీంతో మైదానంలోని ప్రేక్షకులంతా ఉత్కంఠతో మ్యాచ్‌ను వీక్షిస్తున్నా రు. స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న రాస్ టేలర్ షమీ వేసిన మొదటి బంతినే సిక్సర్‌గా మలిచాడు. దీంతో భారత్ అభిమానుల్లో నిరాశ కనిపించిం ది. ఆ తర్వాత బంతికి సింగిల్ ఇచ్చిన షమీ, మూడో బంతికి కేన్ విలియమ్సన్ (95) కీపర్ కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. ఇక నాలుగో బంతికి పరుగులేమీ రాకపోగా, ఐదో బంతికి బైస్ రూపంలో 1 పరుగు వచ్చింది. దీంతో మ్యాచ్ టై అయంది. ఇక చివరి బంతికి న్యూజిలాండ్ విజయానికి 1 పరుగు అవసరం కాగా, రాస్ టేలర్ (17) బౌల్డ్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది.
వారెవ్వా.. రో‘హిట్’!
ఈ సిరీస్‌లో జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లో విపలమైన రోహిత్ శర్మ ఈసారి జట్టునే గెలిపించాడు. టాస్ ఓడి ముందు గా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా తరఫున రోహిత్ శర్మ (65) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 23 బంతుల్లోనే 5 బౌండరీలు, 3 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న హిట్ మ్యాన్, ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్‌లోనూ తనదైన శైలి లో ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. నాలుగు బంతు ల్లో వరుసగా 2,1,6,6 కొట్టి మొత్తం 15 పరుగులు సాధించా డు. ఇందులో విశేషమేమిటంటే మూడు మ్యాచుల్లో నూ భార త్ సిక్సర్ ద్వారానే విజయం సాధించింది. అంతకుముందు సూపర్ ఓవర్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 6 బంతుల్లో 17 పరుగులు చేసింది. కాగా, ఈ విజయం తో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3-0 తేడాతో గెలుచుకుంది. ఇదిలాఉంటే న్యూజిలాండ్‌పై భారత్‌కు ఇదే మొదటి టీ20 సిరీస్ విజయం.
విరాట్ ఖాతాలో మరో రికార్డు..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా విరాట్ సరికొత్త ఘనత సాధించాడు. ప్రస్తుతం కోహ్లీ (1114) పరుగులతో తొలి స్థానంలో కొనసాగుతుండగా, మహేంద్ర సింగ్ ధోనీ (1112) పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్ విరాట్ మూడో స్థానంలో నిలిచాడు. 1273 పరుగులతో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ మొదటి, 1148 పరుగులతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
స్కోర్ బోర్డు..
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సీ) సౌథీ (బీ) బెనె్నట్ 65, లోకేష్ రాహుల్ (సీ) మున్రో (బీ) డీగ్రాండ్ హోం 27, శివమ్ దూబే (సీ) ఇష్ సోదీ (బీ) బెనె్న ట్ 3, విరాట్ కోహ్లీ (సీ) సౌథీ (బీ) బెనె్నట్ 38, శ్రేయాస్ అయ్యర్ (స్టంప్) సీఫెర్ట్ (బీ) శాంత్నార్ 17, మనీష్ పాండే (నాటౌట్) 14, రవీంద్ర జడేజా (నాటౌట్) 10.
ఎక్స్‌ట్రాలు: 5 మొత్తం: 179 (20 ఓవర్లలో 5 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-89, 2-94, 3-96, 4-142, 5-160.
బౌలింగ్: టిమ్ సౌథీ 4-0-39-0, హమీష్ బెనె్నట్ 4-0-54-3, స్కాట్ కుగ్లిజైన్ 2-0-10-0, మిచెల్ శాంత్నార్ 4-0-37-1, ఇష్ సోదీ 4-0-23-0, కొలిన్ డీగ్రాండ్ హోం 2-0-13-1.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ (సీ) శాంసన్ (బీ) శార్దుల్ ఠాకూర్ 31, కొలిన్ మున్రో (స్టంప్) రాహుల్ (బీ) రవీంద్ర జడేజా 14, కేన్ విలియమ్సన్ (సీ) రాహుల్ (బీ) షమీ 95, మిచెల్ శాంత్నార్ (బీ) చాహల్ 9, కొలిన్ డీగ్రాండ్ హోం (సీ) శివమ్ దూబే (బీ) శార్దుల్ ఠాకూర్ 5, రాస్ టేలర్ (బీ) షమీ 17, టిమ్ సీఫెర్ట్ (నాటౌట్) 0.
ఎక్స్‌ట్రాలు: 8, మొత్తం: 179 (20 ఓవర్లలో 6 వికెట్లకు..)
వికెట్ల పతనం: 1-47, 2-52, 3-88, 4-137, 5-178, 6-179.
బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 3-0-21-2, మహ్మద్ షమీ 4-0-32-2, జస్ప్రీత్ బుమ్రా 4-0-45-0, యుజు వేంద్ర చాహల్ 4-0-36-1, రవీంద్ర జడేజా 4-0-23-1, శివమ్ దూబే 1-0-14-0.

*చిత్రాలు.. రోహిత్ శర్మ (65)
*మ్యాచ్ టై అనంతరం సహచర ఆటగాళ్లతో విరాట్ కోహ్లీ