క్రీడాభూమి

ఒలింపిక్స్‌పై శ్రీకాంత్ ధీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 30: టోక్యో ఒలింపిక్స్‌లో ఆడతానని భారత బాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ ధీమా వ్యక్తం చేశాడు. గత ఆరు నెలలుగా ఫిట్నెస్ సమస్యతోపాటు, ఫామ్‌ను కోల్పోవడం కూడా తనను వేధించిందని గురువారం పీటీఐతో మాట్లాడుతూ చెప్పాడు. నిజానికి ఈ ఆరు నెలలు తనకు అత్యంత క్లిష్టంగా తోచామని అన్నాడు. ఫామ్ కోల్పోవడంతో టోక్యో ఒలింపిక్స్ ర్యాంకింగ్స్‌లో 26వ స్థానానికి పడిపోయిన శ్రీకాంత్‌కు టోక్యో ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం దక్కడం కష్టం కాకపోయినా, రాణించడం అశించినంత సులభం కాదని అంటున్నారు. ఒక దేశం నుంచి, ఒక్కో విభాగంలో పోటీ చేయడానికి ఇద్దరేసి ఆటగాళ్లను పంపవచ్చు. అయితే, వారిద్దరికీ డబ్ల్యూటీఫ్ ర్యాంకింగ్స్ ‘టాప్-16’లో చోటు ఉండాలి. ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీనాటికి ఉన్న ర్యాంకింగ్స్‌ను పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం శ్రీకాంత్ 15వ స్థానంలో ఉన్నాడు. కానీ, సుమారు మూడు నెలల కాలంలో ర్యాంకింగ్స్‌లో మార్పులు ఉండే అవకాశాలు లేకపోలేదు. అందుకే, శ్రీకాంత్ మళ్లీ ఫామ్‌లోకి రావడంతోపాటు, ర్యాంకింగ్ పాయింట్లను గణనీయంగా పెంచుకుంటేగానీ టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించలేదు. అంతేగాక, అక్కడ అభిమానుల అంచనాలకు తగినట్టు రాణించలేదు. జపాన్‌లో జరిగే ఒలింపిక్స్‌లో శ్రీకాంత్ పతకం వేటను కొనసాగించడం అనుకున్నంత సులభం కాకపోయినప్పటికీ, అతను మాత్రం పతకంపై ధీమా వ్యక్తం చేశాడు. ఆ మెగా ఈవెంట్‌లో ఆడడం, పతకాన్ని కైవసం చేసుకోవడం తన లక్ష్యమని అన్నాడు. ఒక ప్రశ్నపై స్పందిస్తూ, బాడ్మింటన్‌లో భారత దేశం బలమైన శక్తిగా ఎదగడానికి జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ చేస్తున్న కృషే ప్రధాన కారణమని కితాబునిచ్చాడు. తనతోపాటు ఎంతో మంది క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై పతకాలను సాధించడానికి ఆయన శిక్షణ ఎంతగానో ఉపయోగపడిందని అన్నాడు. పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి అసాధారణ స్టార్లు గోపీచంద్ శిక్షణలోనే రాటుదేరినట్టు శ్రీకాంత్ తెలిపాడు. ఒలింపిక్స్‌సహా అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత్ పతకాల వేట కొనసాగిస్తుందని, తనదైన ముద్ర వేస్తుందని జోస్యం చెప్పాడు.