క్రీడాభూమి

ఆసీస్ అండర్-19 బ్యాట్స్‌మన్‌పై ఐసీసీ పెనాల్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, జనవరి 30: దక్షిణాఫ్రికాలోని పొచెస్ట్‌రూమ్‌లో జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించిన ఆస్ట్రేలియా ఓపెనర్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పెనాల్టీ విధించింది. భారత పేసర్ ఆకాశ్ సింగ్‌ను ఉద్దేశపూర్వకంగానే మోచేతితో పొడిచాడని ఆసీస్ ఓపెనర్ శామ్ ఫానింగ్‌పై ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఐసీసీ అధికారులు వీడియో క్లిప్పింగ్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. శామ్ కావాలనే ఈ చర్యకు పాల్పడినట్టు నిర్ధారించారు. రెండు డీమెరిట్ పాయింట్లు అతని ఖాతాలో చేరుస్తున్నట్టు ప్రకటించారు. నిబంధనల ప్రకారం మైదానంలో ఆటగాళ్లు ఎవరూ ఉద్దేశపూర్వకంగా మరో ఆటగాడిపై దాడి చేయడంగానీ, గాయపరచడానికి ప్రయత్నించడంగానీ చేయకూడదని ఐసీసీ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. డీమెరిట్ పాయింట్లు ఎక్కువగా ఉంటే, దాని ప్రభావం సదరు క్రీడాకారుడి కెరీర్‌పై తీవ్రంగా ఉంటుందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని శామ్‌ను హెచ్చరించింది.

*చిత్రం... శామ్ ఫానింగ్