క్రీడాభూమి

ఆస్ట్రేలియా ఓపెన్‌లో.. బార్టీకి కెనిన్ షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, జనవరి 30: ఈసారి ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ విభాగంలో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రపంచ నంబర్ వన్ ఆష్లే బార్టీకు షాకిచ్చిన సోఫియా కెనిన్ తన కెరీర్‌లో మొదటిసారి ఓ గ్రాండ్ శ్లామ్ టోర్నీ ఫైనల్‌కు చేరుకోగా, నాలుగో సీడ్ సిమోనా హాలెప్‌పై గార్బినె ముగురుజా సంచలన విజయాన్ని నమోదు చేసింది. కాగా, పురుషుల సింగిల్స్‌లో స్విట్జర్లాండ్ సీనియర్ ఆటగాడు, మూడో ర్యాంకర్ రోజర్ ఫెదరర్ ఇంటిదారి పట్టాడు.
రెండో సీడ్, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకోవిచ్ అతనిపై గెలుపొందాడు. డామినిక్ థియేమ్, అలెగ్జాండర్ జ్వెరెవ్ మధ్య శుక్రవారం జరిగే రెండో సెమీ ఫైనల్లో గెలిచిన ఆటగాడితో అతను టైటిల్ కోసం తలపడతాడు.
మహిళల సింగిల్స్‌లో టైటిల్ ఫేవరిట్, ప్రపంచ నంబర్ వన్ బార్టీని ఢీకొన్న కెనిన్ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ, 7-6, 7-5 తేడాతో విజయభేరి మోగించింది. బార్టీ చివరి వరకూ తీవ్ర స్థాయిలో పోటీని ఇచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉన్న 21 ఏళ్ల కెనిన్ మాస్కో (రష్యా)లో జన్మించి, అమెరికాలో స్థిరపడింది. కెరీర్‌లో మొదటిసారి ఓ గ్రాండ్ శ్లామ్ ఫైనల్లో అడుగుపెట్టిన ఆమె టైటిల్ కోసం అన్‌సీడెడ్ మురుగుజాతో తలపడుతుంది. నాలుగో రౌండ్‌లో అమెరికాకే చెందిన 15 ఏళ్ల యువ సంచలనం కొకో గాఫ్‌ను మట్టికరిపించిన కెనిన్ అదే దూకుడును కొనసాగిస్తూ, ఫైనల్ చేరింది. తాను ఫైనల్ చేరతానని ఎవరూ ఊహించలేదని, ఇప్పుడు అందరి దృష్టి తనపై కేంద్రీకృతమవుతుందని తెలుసునని కెనిన్ పేర్కొంది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ప్రపంచ నంబర్ వన్‌ను ఓడించడం టైటిల్ గెల్చుకున్నంత ఆనందంగా ఉందని వ్యాఖ్యానించింది. విజేతగా నిలిచేందుకు శక్తివంచన లేకుండా పోరాడతానని తెలిపింది.
మరో సెమీ ఫైనల్లో ముగురుజా కూడా 7-6, 7-5 తేడాతోనే తన ప్రత్యర్థి, నాలుగో సీడ్ సిమోనా హాలెప్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఆమె ఈ టోర్నీలో కనీసం క్వార్టర్స్ చేరుతుందని విశే్లషకులు ముందుగానే ఊహించారు. అయితే, ఫైనల్లోకి అడుగుపెడుతుందని మాత్రం ఎవరూ అనుకోలేదు. ర్యాంకింగ్స్‌లో తన కంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న హాలెప్‌ను వరుస సెట్లలో ఓడించడం విశేషం. అంతర్జాతీయ టోర్నీల్లో ఆడిన అనుభవం ఎక్కువగా ఉన్న ముగురుజా ఫైనల్లో కెనిన్‌ను ఎంత వరకూ నిలువరిస్తుందనేది చూడాలి.
భారత్ నిష్క్రమణ
ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ నుంచి భారత్ నిష్క్రమించింది. మిక్స్‌డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన నదియా కిన్నోక్‌తో కలిసి పోరాడిన రోహన్ బొపన్న పరాజయాన్ని ఎదుర్కోవడంతో, భారత్ పోరాటానికి తెరపడింది. బొపన్న, నదియా జోడీని నికొలా మెక్టిక్, బార్బరా క్రెజ్‌సికోవా జోడీ 6-0, 6-2 తేడాతో చిత్తుచేసింది.

టైటిల్ దిశగా జొకొవిచ్
ప్రపంచ రెండో ర్యాంక్ ఆటగాడు, డిఫెండింగ్ చాంపియన్ నొవాక్ జొకొవిచ్ ఇక్కడ జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో టైటిల్ దిశగా మరో అడుగు ముందుకేశాడు. సెమీ ఫైనల్లో అతను వెటరన్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్‌ను 7-6, 6-4, 6-3 స్కోరుతో ఓడించాడు. క్రియాశీలకంగా ఉన్న టెన్నిస్ స్టార్లలో అత్యంత అనుభవజ్ఞుడైన ఫెదరర్‌ను జొకొవిచ్ వరుస సెట్లలో ఓడించడం ఈసారి అతను టైటిల్ ఫేవరిట్స్‌లో ఉన్నాడనే విషయాన్ని చెప్పకనే చెప్పింది. కాగా, విజేతగా నిలిజేందుకు అతను డామినిక్ థియేమ్ లేదా అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను ఢీ కొంటాడు. రెండో సెమీ ఫైనల్ శుక్రవారం జరుగుతుంది. ఇంత వరకూ కెరీర్‌లో 16 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న జొకొవిచ్ 17వ టైటిల్ వేటలో సఫలమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశే్లషకులు, అభిమానులు అంటున్నారు.
*చిత్రాలు.. సోఫియా కెనిన్
*నొవాక్ జొకొవిచ్