క్రీడాభూమి

క్లీన్‌స్వీప్ లక్ష్యంగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మంగూనీ: న్యూజిలాండ్ జట్టుపై తొలి టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న కోహ్లీసేన, క్లీన్‌స్వీప్ లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-0 తేడాతో టీమిండియా గెలుచుకున్న విషయం తెలిసిందే. మరోవైపు నేడు జరిగే చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని న్యూజిలాండ్ జట్టు భావిస్తోంది. అయతే గత రెండు మ్యాచుల్లో గెలిచే అవకాశమున్నా కివీస్ ఓటమి మూటగట్టుకుంది. లక్ష్యం చేరేవరకు బాగానే ఆడుతున్నా, చివ ర్లో ప్రత్యర్థి బౌలర్లకు వికెట్లు సమర్పించుకొని గత రెండు మ్యాచుల్లోనూ సూపర్ ఓవర్‌కు అవకాశమిచ్చారు. ఈ రెండు మ్యాచుల్లోనూ మొదట బ్యాటింగ్‌కు దిగిన కివీస్ బలమైన జ ట్టు ముందు స్వల్ప లక్ష్యానే్న ఉంచడంతో పరాజయం తప్ప లేదు. అయతే గత తప్పిదాలను మరిచి, చివరి మ్యాచ్‌లో విజ యం సాధించి, సొంత గడ్డపై పరువు నిలుపుకోవాలని భావి స్తోంది. ఇదిలాఉంటే నేటి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే కివీస్ గడ్డపై క్లీన్‌స్వీప్ చేసిన తొలి భారత జట్టుగా కోహ్లీసేన నిలవనుంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం ఓడితే సొంతగడ్డపై మొదటి సారి వైట్‌వాష్ అయన జట్టుగా కేన్ విలియమ్సన్ సేన చెత్త రికార్డు మూటగట్టుకోనుంది.
మళ్లీ ప్రయోగమేనా?
మరోవైపు ఈ సిరీస్‌లో అన్ని విభాగాల్లో రాణించి ఇప్పటికే సిరీస్ గెలుచుకున్న టీమిండియా మళ్లీ తన ప్రయోగాలకు పదును పెట్టనుంది. గత మ్యాచ్‌లో సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీలకు విశ్రాంతి కల్పించి, రానున్న టీ20 ప్రపంచకప్ దృష్ట్యా తుది జట్టులో యువకులకు అవకాశం కల్పించింది. అయతే సంజూ శాంసన్, శివమ్ దూబే లాంటి ఆటగాళ్లు పూర్తిగా నిరాశ పర్చగా, శార్దూల్ ఠాకూర్ గత మ్యాచ్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయడమే కాకుండా, బ్యాట్ తోనూ రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అయతే నేడు జరిగే చివరి మ్యాచ్‌లోనూ భారత్ తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా యువ ఆటగాళ్లకు మరో చాన్స్ ఇచ్చే అవకాశ ం ఉంది.
పంత్ సంగతి అంతేనా?
ప్రపంచకప్‌కు ముందు, తర్వాత యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ చాలా అవకాశాలిచ్చింది. ప్రపంచ కప్ తర్వాత సీనియర్ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ జట్టులో కొనసాగకపోవడంతో ఇక రిషభ్ పంత్ స్థానానికి ఎలాంటి ఢో కా లేదనుకున్నారు. అయతే ఆ తర్వాత టెస్టుల్లో వృద్ధిమాన్ సాహా పునరాగమనం చేయడం, ఇటీవల రిషభ్ సైతం గాయం తో జట్టుకు దూరం కావడం నిజంగా అతడి దురదుష్టమనే చె ప్పాలి. న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ఎంపికైనా ఇప్పటివరకు తుది జట్టులోకి జట్టు మేనేజ్‌మెంట్ తీసుకోకపోవడం విశేషం. రాను న్న పొట్టి ప్రపంచకప్ దృష్ట్యా ఓపెనర్ కేఎల్ రాహుల్‌కు కీపర్ గా అదనపు బాధ్యతలు అప్పగించిన టీమ్ మేనేజ్‌మెంట్ ఈ విషయంలో విజయవంత మైందనే చెప్పాలి. దీనికితోడు కోచ్, కెప్టెన్ కూడా కొద్దిరోజులు రాహుల్ కీపర్‌గా బాధ్యతలు నెరవే ర్చాల్సి వస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో రిషభ్ తి రిగి జట్టులోకి రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
రాహుల్.. శ్రేయాస్..
కివీస్‌తో సిరీస్‌లో ఇప్పటివరకు నిలకడగా రాణించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ మాత్రమే. అయతే జట్టు అవసరాన్ని బట్టి కెప్టెన్ కోహ్లీ, మనీష్ పాండే, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలు కూడా రాణించారు. అయతే సిరీస్ ఇప్పటికే భారత్ వశం కావడంతో తుది జట్టులో కుర్రాళ్లకు అవకాశమిచ్చేందుకు జట్టు మేనేజ్‌మెంట్ మొగ్గు చూపుతోంది.
జట్ల అంచనా..
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, రిషభ్‌పంత్, సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుందర్.
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గుప్టిల్, రాస్ టేలర్, స్కాట్ కుగ్లిజైన్, కొలిన్ మున్రో, టామ్ బ్రూస్, డారియల్ మిచెల్, మిచెల్ శాంత్నార్, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), హమీష్ బెనె్నట్, ఇష్ సోదీ, టీమ్ సౌథీ, బ్లేయర్ టిక్‌నర్.