క్రీడాభూమి

ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా మహిళల ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాన్‌బెర్రా, ఫిబ్రవరి 2: ముక్కోణపు టోర్నీలో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళా జట్టు ఓటమి పాలైంది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆసిస్ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది. ఓపెనర్ స్మృతీ మంధాన (35), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (28) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ 103 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎలిసే పెర్రీ 4 వికెట్లు తీయగా, టైలా వ్లామెనిక్ 3, మెఘన్ స్కాచ్, జెస్ జొనస్సేన్‌లు ఒక్కో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో కంగారూలు మరో 7 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు నష్టపోయ విజయం సాధించారు. ఎలిసే పెర్రీ (49), ఆష్లే గార్డ్‌నర్ (22) రాణించారు.