క్రీడాభూమి

భారత్ క్లీన్‌స్వీప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్‌మాంగూనీ, ఫిబ్రవరి 2: అంతా అనుకున్నట్లుగానే భారత్ చేతిలో సొంతగడ్డపై న్యూజిలాండ్ జట్టు వైట్‌వాష్‌కు గురైంది. ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ (2) రెండో ఓవర్‌లోనే కుగ్లీజైన్ బౌలింగ్‌లో పెవలియన్‌కు చేరాడు. దీంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్‌తో కలిసి ఇన్నిం గ్స్‌ను నడిపించే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. వీరు చెత్త బంతుల్ని బౌండరీలకు పంపుతూ జట్టు స్కోరును పరుగులు పెట్టించారు. మరోవైపు న్యూజిలాండ్ కెప్టెన్, టిమ్ సౌథీ, మిచెల్ శాంత్నార్‌ను టార్గెట్ చేస్తూ పరుగులు రాబట్టారు. ఈ క్రమం లోనే లోకేష్ రాహుల్ (45) బెనె్నట్ బౌలింగ్‌లో శాంత్నార్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 88 పరుగులను జోడించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ శర్మ (60) కివీ బౌలర్లపై విరుచు కుపడ్డాడు. ఈ క్రమంలోనే సౌథీ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయతే కొద్దిసేపటికే రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబే (5) ఈ మ్యాచ్‌లోనూ నిరాశ పరిచాడు. మనీష్ పాండే (11, నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (33, నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయ 163 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో స్కాట్ కుగ్లిజైన్ 2 వికెట్లు తీయగా, హమీష్ బెనె్నట్‌కు 1 వికెట్ దక్కింది.
మళ్లీ అదే పొరపాటు..
భారత్ జట్టు ముందుంచిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ జట్టు మళ్లీ అదే పొరపాటు చేసింది. ఈ సిరీస్‌లో బ్యాటింగ్ విభాగంలో పూర్తిగా విఫలమైన కివీస్, ఈసారీ తన ఆటతీరు మార్చుకోలేదు. 17 పరుగులకే ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ (2), కొలిన్ మున్రో (15), టామ్ బ్రూస్ (0) వికెట్లు కోల్పోయ పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో క్రీజులో ఉన్న వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ (50), రాస్ టేలర్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 99 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని అందించారు. అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే సీఫెర్ట్ అవుటయ్యాడు. ఆ తర్వాత డారియల్ మిచెల్ (2), మిచెల్ శాంత్నార్ (6), స్కాట్ కుగ్లిజైన్ (0) నిరాశ పరచగా, ఈ మ్యాచ్ ద్వార వందో టీ20 ఆడుతున్న రాస్ టేలర్ (53) అర్ధ సెంచరీ సాధించిన కొద్దిసేప టికే సైనీ బౌలింగ్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనం తరం క్రీజులో ఉన్న టీమ్ సౌథీ (6) బుమ్రా బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఇష్ సోదీ (16, నాటౌట్), హమీష్ బెనె్నట్ (1, నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉన్నా జట్టును గెలి పించలేకపోయారు. దీంతో టీమిండియా తొలిసారి న్యూజి లాండ్ జట్టును ఓడించి సిరీస్ సొంతం చేసుకోవడమే కాకుం డా, తొలిసారి కివీస్‌ను వారి సొంతగడ్డపైనే వైట్‌వాష్ చేసిన జట్టుగా అవతరించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు తీసుకోగా, నవదీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్‌లు రెండేసి, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లోకేష్ రాహుల్ అందుకోగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రాకు దక్కింది. ఈ మ్యాచ్ ద్వారా బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పా డు. అతి తక్కువ మ్యాచ్‌ల్లో 7 మెయడెన్లు వేసిన బౌలర్‌గా చరి త్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా 12 పరుగులిచ్చి ఒక మెయడిన్ ఓవర్ వేసి 3 వికెట్లు తీశాడు.
కోహ్లీకి విశ్రాంతి..
న్యూజిలాండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొదటి మూడు మ్యాచ్‌లు గెలుచుకొని సిరీస్ సొంతం చేసుకున్న కోహ్లీ సేన, రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని మిగతా రెండు మ్యాచ్‌ల్లో కుర్రాళ్లకు అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే నాలుగో మ్యాచ్‌లో రోహిత్ శర్మతో పాటు మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలను రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేయగా, చివరి మ్యాచ్‌లో రోహిత్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించగా, విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకున్నాడు.
దూబే చెత్త రికార్డు..
టీమిండియా బౌలర్ శివమ్ దూబే టీ20ల్లో చెత్త రికార్డు నమోదు చేశాడు. 10వ ఓవర్ వేసిన దూబే ఏకంగా 34 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో గతంలో స్టువర్ట్ బిన్నీ (32 పరుగులు) పేరిట ఉన్న చెత్త రికార్డును దూబే అధిగమించినట్లయంది. ఓవరాల్‌గా స్టువర్ట్ బ్రాడ్ (36) పరుగులు సమర్పించుకున్నాడు.
*చిత్రం... రోహిత్ శర్మ (60)