క్రీడాభూమి

హిట్‌మ్యాన్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, ఫిబ్రవరి 4: న్యూజిలాండ్ జట్టును సొంత గడ్డపై టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ చేసిన భారత్ నేటి నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో తలపడనుంది. పొట్టి ఫార్మాట్ లో తిరుగులేని కోహ్లీసేన అదే ఉత్సాహంతో బరిలోకి దిగ నుండగా, కివీస్ మాత్రం స్వదేశంలో పరువు నిలుపు కునేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమం లో నేటి నుంచి జరిగే వనే్డ సిరీస్ న్యూజిలాండ్ జట్టుకు ప్రతిష్టాత్మకంగా మారింది. మరోవైపు భారత జట్టులో ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ గాయం కారణంగా వనే్డతో పాటు టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. గత మ్యాచ్ లో కాలి గాయం కారణంగా చికిత్స తీసుకుంటున్నాడు. అయతే సినీయర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా గాయం కారణంగా కివీస్ పర్యటనకు దూరమైన విషయం తెలిసిం దే. దీంతో నేటి వనే్డలో ఓపెనర్లుగా యువ ఆటగాళ్లు పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ దిగే అవకాశముంది. మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఐదో స్థానంలో లోకేష్ రాహుల్, మనీష్ పాండేతో టాప్, మిడిలార్డర్ బలంగానే కనిపిస్తోంది. ఇక ఆల్‌రౌండర్ రవీంద్రజడేజా, శివమ్ దూబే , కేదార్ జాదవ్ లో ఎవరో ఒకర్ని తీసుకునే అవకాశముంది. ఇక బౌలింగ్ లో మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా శార్దుల్ ఠాకూర్, సంజూ శాంసన్ పేస్ విభాగంతో పటిష్టంగా కనిపిస్తుండ గా, స్పిన్నర్లలో యుజువేంద్ర చాహల్‌ను తీసుకునే అవకాశ ముంది. ఇదిలాఉంటే న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా మొదటి రెండు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. భుజం గాయం కారణంగా చివరి 2 టీ20లకు దూరమైన విషయం తెలిసిందే. టిమ్ సౌథీకి బదులు టామ్ లాథమ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
*చిత్రం... వనే్డ ట్రోఫీతో విరాట్ కోహ్లీ, టామ్ లాథమ్