క్రీడాభూమి

భళా.. యువ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొచెస్‌ట్రూమ్ (దక్షిణాఫ్రికా), ఫిబ్రవరి 4: అండర్-19 ప్రపంచకప్ సెమీ ఫైనల్‌లో యువ భారత్ అద్భుతం చేసింది. ప్రత్యర్థి జట్టుపై అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో ఏకపక్షంగా ఆధిపత్యం చెలాయంచి సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన దాయాది జట్టును టీమిండియా బౌలర్లు హడలెత్తించారు. నిప్పులు చెరిగే బంతులు వేసి వారిని కట్టడి చేశారు. దీంతో పాకిస్తాన్ 43.1 ఓవర్లలోనే కేవలం 172 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ హైదర్ అలీ (56), కెప్టెన్, వికెట్ కీపర్ రోహైల్ నజీర్ (62) మాత్రమే అర్ధ సెంచరీలతో ఆకట్టుకోగా, మిగతా బ్యాట్స్‌మెన్లంతా పరుగులు తీసేందుకు ఇబ్బందులు పడ్డారు. పాకిస్తాన్ జట్టుకు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చిన 12 పరుగులే నాలుగో అత్యధిక స్కోరు కావడం విశేషం. భారత బౌలర లలో సుశాంత్ మిశ్రా 3 వికెట్లు తీయగా, కార్తీక్ త్యాగీ, రవి బిష్ణోయలు రెండేసి, అథార్వ అంకోలెకర్, యశస్వీ జైస్వాల్ చెరో వికెట్ తీశారు.
వికెట్ నష్టపోకుండా..
ప్రత్యర్థి జట్టు టీమిండియా ముందుంచిన 173 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (105, నాటౌట్) సెంచరీకి తోడు, దివ్యాన్ష్ సక్సేనా (59, నాటౌట్) అర్ధ సెంచరీ సాధించి పాకిస్తాన్ బౌలర్లను ముచ్చెమటలు పట్టించారు. బౌలరెవరైనా బంతిని బౌండరీకి పంపుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అమీర్ అలీ వేసిన 36వ ఓవర్‌లో రెండో బంతిని సిక్సర్‌గా మలిచిన యశస్వీ జైస్వాల్ సెంచరీ చేయడంతో పాటు జట్టునూ గెలిపించాడు. ఫైనల్‌కు చేరుకున్న మొదటి జట్టుగా భారత్ నిలిచింది.
ఓటమనేదే లేకుండా..
ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత్ జట్టు ఓటమనేదే లేకుండా ఫైనల్‌కు చేరడం విశేషం. గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌లాడిన భారత్ అన్నింటిలోనూ విజయం సాధించింది. జనవరి 19న శ్రీలంకతో జరిగిన మొదటి మ్యాచ్‌లో 90 పరుగులతో, 21న జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో, 24 న్యూజిలాండ్‌తో డక్‌వర్త్ లూయస్ పద్ధతిలో 44 పరుగుల తేడాతో గెలుపొందగా, ఆ తర్వాతి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 74 పరుగులతో విజయం సాధించింది. తాజాగా జరిగిన సెమీఫైనల్‌లో దాయాది దేశమైన పాకిస్తాన్‌పై 10 వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది.
స్కోర్ బోర్డు..
పాకిస్తాన్ అండర్ 19 ఇన్నింగ్స్: హైదర్ అలీ (సీ) రవి బిష్ణోయ (బీ) జైస్వాల్ 56, మహ్మద్ హురైరా (సీ) సక్సేనా (బీ) సుశాంత్ మిశ్రా 4, ఫహద్ మునీర్ (సీ) అంకోలేకర్ (బీ) రవి బిష్ణోయ 0, రోహైల్ నజీర్ (సీ) తిలక్ వర్మ (బీ) సుశాంత్ మిశ్రా 62, ఖాసీం అక్రమ్ (రనౌట్) అంకోలేకర్/ధ్రువ్ జురేల్ 9, మహ్మద్ హరీస్ (సీ) సక్సేనా (బీ) అంకోలేకర్ 21, ఇర్ఫాన్ ఖాన్ (బీ) కార్తీక్ త్యాగీ 3, అబ్బాస్ అఫ్రిదీ (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) రవి బిష్ణోయ 2, తాహీర్ హుస్సేన్ (సీ) ధ్రువ్ జురేల్ (బీ) కార్తీక్ త్యాగీ 2, అమీర్ అలీ (సీ) సిద్దేశ్‌వీర్ (బీ) సుశాంత్ మిశ్రా 1, మహ్మద్ అమీర్ ఖాన్ (నాటౌట్) 0.
ఎక్స్‌ట్రాలు: 12 మొత్తం: 172 (43.1 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-9, 2-34, 3-96, 4-118, 5-146, 6-156, 7-163, 8-169, 9-172, 10-172.
బౌలింగ్: కార్తీక్ త్యాగీ 8-0-32-2, సుశాంత్ మిశ్రా 8.1-0-28-3, రవి బిష్ణోయ 10-0-46-2, ఆకాశ్ సింగ్ 7-0-25-0, అథార్వ అంకోలేకర్ 7-0-29-1, యశస్వీ జైస్వాల్ 3-0-11-1.
భారత్ అండర్ 19 ఇన్నింగ్స్: యశస్వీ జైస్వాల్ (నాటౌట్) 105, దివ్యాన్ష్ సక్సేనా (నాటౌట్) 59.
ఎక్స్‌ట్రాలు: 12 మొత్తం: 176 (35.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా..)
బౌలింగ్: తాహీర్ హుస్సేన్ 6-1-17-0, ఖాసీం అక్రమ్ 8-0-37-0, మహ్మద్ అమీర్ ఖాన్ 5-1-20-0, అబ్బాస్ అఫ్రిదీ 7-0-50-0, అమీర్ అలీ 5.2-0-38-0, ఫహద్ మునీర్ 4-0-12-0.

*చిత్రం...యశస్వీ జైస్వాల్ (105, నాటౌట్), *దివ్యాన్ష్ సక్సేనా (59, నాటౌట్)