క్రీడాభూమి

పదమూడు టెస్టులు.. ఆరు కొత్త కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 9: నాలుగు దేశాలతో జరిగే 13 టెస్టు మ్యాచ్‌లకు ఆరు కొత్త కేంద్రాలను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఖరారు చేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం టెస్టు హోదాను సంతరించుకోనున్నాయి. గురువారం ఇక్కడి బోర్డు కార్యాలయంలో జరిగిన టూర్ ప్రోగామ్స్, ఫిక్స్‌చర్స్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్లు మన దేశంలో టెస్టు సిరీస్‌లు ఆడతాయి. మొత్తం 13 టెస్టు మ్యాచ్‌లను బిసిసిఐ ధ్రువీకరించింది. ధర్మశాల, విశాఖపట్నం, రాంచీ, పుణె, రాజ్‌కోట్, ఇండోర్ కేంద్రాల్లో మొదటిసారి టెస్టు మ్యాచ్‌లు జరుగుతాయి. న్యూజిలాండ్ జట్టు మన దేశంలో పర్యటించి మూడు టెస్టు, ఐదు వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడుతుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్లు వస్తుంది. ఈ జట్టు ఐదు టెస్టులు, మూడు వనే్డలతోపాటు మరో మూడు టి-20 ఇంటర్నేషనల్స్‌ను కూడా ఆడనుంది. ఇంగ్లాండ్ టూర్ ముగిసిన తర్వాత, వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో నాలుగు టెస్టులు ఆడుతుంది. ఆతర్వాత బంగ్లాదేశ్ ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత్‌తో తలపడుతుంది.
షెడ్యూల్ వివరాలు
న్యూజిలాండ్‌తో మూడు టెస్టులు (ఇండోర్, కాన్పూర్, కోల్‌కతా), ఐదు వనే్డలు (్ధర్మశాల, ఢిల్లీ, మొహాలీ, రాంచీ, విశాఖపట్నం).
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టులు (మొహాలీ, రాజ్‌కోట్, ముంబయి, విశాఖపట్నం, చెన్నై), మూడు వనే్డలు (పుణె, కటక్, కోల్‌కతా), మూడు టి-20 ఇంటర్నేషనల్స్ (బెంగళూరు, నాగపూర్, కాన్పూర్).
ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు (బెంగళూరు, ధర్మశాల, రాంచీ, పుణె).
బంగ్లాదేశ్‌తో ఒక టెస్టు (హైదరాబాద్).

చిత్రం ధర్మశాల క్రికెట్ మైదానం