క్రీడాభూమి

ఆంధ్రా ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటియాల, ఫిబ్రవరి 5: రంజీట్రోఫీలో భాగంగా ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్రా జట్టుపై పంజాబ్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు మంగళవారం మొదటి ఇన్నింగ్స్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా 97 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. అదేరోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ సైతం 108 పరుగులకే ఆలౌటై 11 పరుగుల ఆధిక్యం సంపాందించింది. దీంతో వెంటనే రెండో ఇన్నిం గ్స్‌కు దిగిన ఆంధ్రా జట్టు తొలి రోజు ఆట ముగి సే సమయానికి 4 వికెట్లు కోల్పోయ 31 పరుగు లు చేసిన విషయం తెలిసిందే. బుధవారం రెం డో రోజు ఆటలో 134 పరుగులు చేసి ఆలౌటైం ది. కెప్టెన్ రికీ భుయ్ (61), కేవీ శశికాంత్ (47) మాత్రమే రాణించారు. స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ 39 ఓవర్లలో 6 వికెట్లను కోల్పో య విజయం సాధించింది. వికెట్ కీపర్ అన్మో ల్ మల్హోత్రా (51, నాటౌట్), అభిషేక్ గుప్తా (37) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.