క్రీడాభూమి

నాగాలాండ్‌పై గోవా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిమపూర్, ఫిబ్రవరి 6: రంజీట్రోఫీలో భాగంగా ఇక్కడ జరుగుతున్న మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టుపై గోవా 229 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నెల 4న ప్రారంభమైన మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటిం గ్‌కు దిగిన గోవా మొదటి ఇన్నింగ్స్‌లో 318 పరుగులకు ఆలౌటైంది. వైభవ్ గోవెకర్ (71), స్మిత్ పటేల్ (66) అర్ధ సెంచరీలతో రాణించారు. నాగాలాండ్ బౌలర్లలో శ్రీకాంత్ ముండే 4 వికెట్లు తీయగా, మ్లివాతి లిమ్టర్ 3, తహ్మిద్ రహ్మాన్ 2, స్టువర్ట్ బిన్నీ 1 వికెట్ తీశారు. అనంతరం మొద టి ఇన్నింగ్స్‌కు దిగిన నాగాలాండ్ 176 పరుగులకే కుప్ప కూలింది. శ్రీకాంత్ ముండే (64) మాత్రమే అర్ధ సెంచరీతో రాణించాడు. అమూల్య పంద్రేకర్ 5 వికెట్లు తీసుకోగా, దర్శన్ మిసాల్ 2, లక్ష్యాయ్ గార్గ్, అమిత్ వర్మ, ఫెలిక్స్ అలిమావోలు ఒక్కో వికెట్ తీసుకున్నారు. అయతే మొదటి ఇన్నింగ్స్‌లో లభించిన 142 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన గోవా 41 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయ 221 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అమిత్ వర్మ (66), స్నేహల్ సుహాస్ కౌతంకర్ (68, నాటౌట్) అర్ధ సెంచరీలు సాధించారు. దీంతో 363 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు వచ్చిన నాగాలాండ్ జట్టు 134 పరుగులకే కుప్పకూలింది. స్టువర్ట్ బిన్నీ (58), శ్రీకాంత్ ముండే (35) మాత్రమే ఆకట్టుకున్నారు. విజేష్ ప్రభూదేశాయ్‌కి 3 వికెట్లు పడగా, లక్ష్యాయ్ గార్గ్, దర్శన్ మిసాల్, అమిత్ వర్మలకు రెండేసి వికెట్లు, ఫెలిక్స్ అలిమావోకు 1 వికెట్ దక్కింది.