క్రీడాభూమి

టాప్’ కూలింది.. సిరీస్ పోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్లాండ్: అంతా అనుకున్నట్లే జరిగింది. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి న్యూజిలాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన కోహ్లీసేన, వనే్డల్లో తేలి పోయింది. కీలక ఆటగాళ్ల గాయాలకు తోడు, అనుభవలేమీ యువ క్రి కెటర్ల ఆటతీరుతో మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్రత్య ర్థి జట్టుకు అప్పగించేసింది. మరోవైపు సొంతగడ్డపై పొట్టి సిరీ స్‌ను కోల్పోయన కివీస్ దానికి ప్రతీకారం తీర్చుకున్నట్ల యంది. శనివారం జరిగిన రెండో వనే్డలో ముందుగా టాస్ గెలిచిన భారత్ ఆతిథ్య జట్టును బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో క్రీజులోకి వచ్చిన మార్టిన్ గుప్టిల్, హెన్రీ నికోల్స్ జట్టుకు మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ మొదటి నుంచి భారత బౌలర్లను టార్గెట్ చేస్తూ పరుగులు రాబట్టారు. ప్రతి బంతిని ఆచితూచి ఆడుతూ ముందుకు సాగారు. అయ తే చాహల్ బౌలింగ్‌లో హెన్రీ నికోల్స్ (41) ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ కావడంతో 93 పరుగుల వద్ద కివీస్ మొదటి వికెట్‌ను కోల్పోయంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన టామ్ బ్లండెల్ సహకారంతో గుప్టిల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు టామ్ బ్లండెల్ (22) సైతం మూడు బౌండరీలతో అలరించినా శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో సైనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో 15 పరుగుల వ్యవధిలోనే మార్టిన్ గుప్టిల్ (79) శార్దూల్ అద్భుత ఫీల్డింగ్‌తో రనౌట్ అయ్యాడు.
బౌలర్ల కట్టడి..
గుప్టిల్ పెవిలియన్ చేరిన తర్వాత భారత బౌలర్లు వెంటవెంటనే వికెట్లు తీయడమే కాకుండా, పరుగులను కట్టడి చేశారు. టామ్ లాథమ్ (7), జేమ్స్ నీషమ్ (3), కొలిన్ డీ గ్రాండ్ హోం (5), మార్క్ చప్మాన్ (1), టిమ్ సౌథీ (3) వికెట్లు టపాటపా పడిపోయాయ. ఓవైపు వికెట్లు పడుతున్నా, మరోవైపు గత మ్యాచ్ సెంచరీ హీరో, సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ (73, నాటౌట్) తన జోరును కొనసాగించాడు. తనకు అందివచ్చిన బంతులను బౌండరీలుగా మారుస్తూ జట్టు బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. కైల్ జమీసన్‌తో కలిసి చివరి ఓవర్లలో ధాటిగా ఆడి అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. జమీసన్ (25, నాటౌట్) సైతం 1 బౌండరీ, 2 సిక్సర్లతో అలరించాడు. వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా చివరి వరకు క్రీజులో నిలిచి 76 పరుగులను జోడిం చడంతో న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయ 273 పరుగులు చేసింది.
పేకమేడలా..
న్యూజిలాండ్ జట్టు ముందుంచిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే ందుకు బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన ఆదిలోనే తడబడింది. ఈ మ్యాచ్‌లోనూ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (3), పృథ్వీ షా (24) నిరాశ పరిచారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (15) సైతం సౌథీ వేసిన బంతిని అంచనా వేయక వికెట్ల ముందు దొరికిపోయాడు. అద్భుత ఫాంలో ఉన్న లోకేష్ రాహుల్ (4), కేదార్ జాదవ్ (9) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడంతో భారత్ 96 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయ కష్టాల్లో పడింది.
అయ్యర్ మళ్లీ..
గత మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్న యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (52) ఈ మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయతే బెనె్నట్ బౌలింగ్‌లో బౌండరీతో అర్ధ సెంచరీ సాధించి, ఆ తర్వాతి బంతికే అనవసరమైన షాట్‌కి యత్నించి కీపర్ లాథమ్‌కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
చిగురించిన ఆశలు..
శ్రేయాస్ అయ్యర్ అవుటయ్యాక, క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ (18) తొందరగానే పెవిలియన్‌కు చేరాడు. దీంతో విజయంపై పూర్తి నమ్మకం పోయంది. అయతే ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన నవదీప్ సైనీ, రవీంద్ర జడేజాలు కివీ బౌలర్లను ఊచ కోత కోశారు. వీరిద్దరూ చూడచక్కని బౌండరీ లతో మ్యాచ్‌పై మళ్లీ ఆశలు రెకెత్తించారు. ఈ క్రమంలోనే జడేజా అర్ధ సెంచరీ సాధించాడు. మరోవైపు అర్ధ సెంచరీకి సమీపించిన నవదీప్ సైనీ (45) జమీసన్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేప టికే యుజువేంద్ర చాహల్ (10) రనౌట్, రవీంద్ర జడేజా (55) కూడా అవుట్ కావడంతో భారత్ 251 పరుగులకే కుప్పకూలింది. న్యూజిలాండ్ బౌలర్లలో బెనె్నట్, సౌథీ, జమీసన్, డీగ్రాండ్ హోంలు తలా రెండేసి వికెట్లు తీసుకోగా, జేమ్స్ నీషమ్ 1 వికెట్ దక్కించుకున్నాడు. ఈ విజయంతో కివీస్ మూడు వనే్డల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకుంది.
స్కోర్ బోర్డు..
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ (రనౌట్) శార్దూల్ ఠాకూర్/రాహుల్ 79, హెన్రీ నికోల్స్ (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) చాహల్ 41, టామ్ బ్లండెల్ (సీ) నవదీప్ సైనీ (బీ) శార్దూల్ ఠాకూర్ 22, రాస్ టేలర్ (నాటౌట్) 73, టామ్ లాథమ్ (ఎల్‌బీడబ్ల్యూ) (బీ) రవీంద్ర జడేజా 7, జేమ్స్ నీషమ్ (రనౌట్) రవీంద్ర జడేజా 3, కొలిన్ డీ గ్రాండ్ హోం (సీ) శ్రేయాస్ అయ్యర్ (బీ) శార్దూల్ ఠాకూర్ 5, మార్క్ చప్మాన్ (సీ) (బీ) చాహల్ 1, టిమ్ సౌథీ (సీ) నవదీప్ సైనీ (బీ) చాహల్ 3, కైల్ జమీసన్ (నాటౌట్) 25
ఎక్స్‌ట్రాలు: 14 మొత్తం: 273 (50 ఓవర్లలో 8 వికెట్లకు)
వికెట్ల పతనం: 1-93, 2-142, 3-157, 4-171, 5-175, 6-185, 7-187, 8- 197
బౌలింగ్: శార్దూల్ ఠాకూర్ 10-1-60-2, జస్ప్రీత్ బుమ్రా 10-0-64-0, నవదీప్ సైనీ 10-0-48-0, యుజువేంద్ర చాహల్ 10-0-58-3, రవీంద్ర జడేజా 10-0-35-1
భారత్ ఇన్నింగ్స్: పృథ్వీ షా (బీ) జమీసన్ 24, మయాంక్ అగర్వాల్ (సీ) రాస్ టేలర్ (బీ) బెనె్నట్ 3, విరాట్ కోహ్లీ (బీ) సౌథీ 15, శ్రేయాస్ అయ్యర్ (సీ) లాథమ్ (బీ) బెనె్నట్ 52, లోకేష్ రాహుల్ (బీ) కొలిన్ డీ గ్రాండ్ హోం 4, కేదార్ జాదవ్ (సీ) హెన్రీ నికోల్స్ (బీ) సౌథీ 9, రవీంద్ర జడేజా (సీ) కొలిన్ డీ గ్రాండ్ హోం (బీ) నీషమ్ 55, శార్దూల్ ఠాకూర్ (బీ) కొలిన్ డీ గ్రాండ్ హోం 18, నవదీప్ సైనీ (బీ) జమీసన్ 45, యుజువేంద్ర చాహల్ (రనౌట్) నీషమ్/లాథమ 10, జస్ప్రీత్ బుమ్రా (నాటౌట్) 9.
ఎక్స్‌ట్రాలు: 16
మొత్తం: 251 (48.3 ఓవర్లలో ఆలౌట్)
వికెట్ల పతనం: 1-21, 2-34, 3-57, 4-71, 5-96, 6-129, 7-153, 8-229, 9-251, 10-251
బౌలింగ్: హమీష్ బెనె్నట్ 9-0-58-2, టిమ్ సౌథీ 10-1-41-2, కైల్ జమిసన్ 10-1-42-2, కొలిన్ డీ గ్రాండ్ హోం 10-1-54-2, జేమ్స్ నీషమ్ 9.3-0-52-1.
*చిత్రం... చివరి వికెట్‌గా రవీంద్ర జడేజాను అవుట్ చేసిన ఆనందంలో న్యూజిలాండ్ ఆటగాళ్లు