క్రీడాభూమి

కొంపముంచిన వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోట్చెఫ్‌స్ట్రూమ్, ఫిబ్రవరి 9: చివరి వరకు ఉత్కంఠగా సాగిన అండర్ -19 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ పరాజయం పాలైంది. ఆఖర్లో వరుణుడు అడ్డు తగలడంతో బంగ్లాదేశ్ టార్గెట్ 24 బంతుల్లో 1 పరుగు కావడంతో సులువుగా ఛేదించి, తొలిసారి అండర్-19 ప్రపంచకప్‌ను ముద్దాడింది. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులకు ఆలౌటైంది. యశస్వీ జైస్వాల్ (88), తిలక్ వర్మ (38) మాత్రమే రాణించారు. అనంతరం స్వల్ప లక్ష్యానికి దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆది నుంచే దూకుడుగా ఆడింది.
ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తర్వాత టీమిండియా బౌలర్ రవి బిష్ణోయ విజృంభించి వరుస వికెట్లు పడగొట్టడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారిం ది. చివరకు వర్షం అడ్డుతగలడంతో బంగ్లా మూడు వికెట్ల తేడాతో టార్గెట్‌ను ఛేదించింది. బంగ్లా ఆటగాళ్లలో పర్వేజ్ హుస్సేన్ ఎమాన్ (47), కెప్టెన్ అక్బర్ అలీ (43, నాటౌట్) రాణించారు. టీమిండియా బౌలర్లలో రవి బిష్ణోయ 4 వికెట్లు తీయగా, సుశాంత్ మిశ్రా 2, యశస్వీ జైస్వాల్ 1 వికెట్ పడగొట్టారు.
*చిత్రం... విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టు