క్రీడాభూమి

ఇంగ్లాండ్‌పై ఆసిస్ మహిళల గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, ఫిబ్రవరి 9: ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టుపై ఆస్ట్రేలియా మహిళా జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్ బ్యాట్స్‌వుమెన్స్‌లో బెత్ మూనీ (50) అర్ధ సెంచరీకి తోడు రఖేల్ హేన్స్ (24) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయ 132 పరుగులు చేసింది. సోఫీ ఎకిల్‌స్టోన్, సారా గ్లేన్ రెండేసి వికెట్లు తీసుకోగా, కెథరిన్ బ్రంట్ 1 వికెట్ తీసుకుంది.
అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయ 116 పరుగులు మాత్రమే చేసి 1 పరుగు తేడాతో ఓటమి చవిచూసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో కెథరిన్ బ్రంట్ (23, నాటౌట్), లారెన్ విన్‌ఫీల్డ్ (23) మాత్రమే ఆకట్టుకున్నారు.
*చిత్రం... బుష్ ఫైర్ మ్యాచ్ సందర్భంగా టీమిండియా లెజండరీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో
ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లు.