క్రీడాభూమి

భారత్ పరువు నిలబడుతుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌంట్ మాంగనూయి (న్యూజిలాండ్), ఫిబ్రవరి 10: టీమిండియా తన బ్యాటింగ్ పాటవాన్ని నిరూపించుకుంటుందా? కోహ్లీ సేన భారత ఆశలను ఆరిపోకుండా కాపాడగలుగుతుందా? న్యూజిలాండ్‌తో వనే్డ ఇంటర్నేషనల్ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లను కోల్పోయిన భారత్ మంగళవారం జరుగనున్న చివరి మ్యాచ్‌లో ఏమేరకు తన శక్తిసామర్థ్యాలను కనబరుస్తుందన్న దానిపైనే యావత్ భారతం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. కనీసం చివరి వనే్డలోనైనా అద్భుతాలు చేయలేకపోయినా గెలిచామనుకుంటే పరువైనా నిలబడుతుందా అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం జరుగనున్న చివరి వనే్డలో భారత్ టాప్ ఆర్డర్ ఏమేరకు రాణిస్తుంది? టీమ్‌లోని ఆటగాళ్లు అంతిమ విజయాన్ని సాధించే దిశగా ఏమేరకు తమ వంతు చేయూత ఇస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. మొత్తమీద మాటలు కాదు.. చేతలు అన్న రీతిలో టాప్ ఆర్డర్ రాణిస్తేనే మిగతా బ్యాట్స్‌మన్ కూడా అందుకు తోడ్పడితేనే ‘వైట్‌వాష్’ నుంచి భారత్ తప్పించుకోగలుగుతుంది. గత రెండు మ్యాచ్‌లలో జరిగిన పొరపాట్లు, ఎదురైన పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా భారత్ ఆటగాళ్లు ఏమేరకు తమను తాము సరిదిద్దుకుని కనీసం చివరి వనే్డలోనైనా జయకేతనం ఎగురవేస్తారేమోనని ఎదురుచూడాలి. ఆఖరి మ్యాచ్‌లో టీమిండియాలో గాయాల కారణంగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఆడేందుకు ఆస్కారం లేదు. ఈ బాధ్యతలను ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వనే్డ సిరీస్‌లో రోహిత్ శర్మ లేకపోవడం ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌లలో పెద్ద లోటుగా విశే్లషకులు చెబుతున్నారు. ఇపుడు ఫైనల్ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగే పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్ తమ జట్టు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ లేని లోటును భర్తీ చేస్తే కెప్టెన్ కోహ్లీ, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌తోపాటు మిగిలిన బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు తమ వంతు పాత్రను పోషించగలరనే నమ్మకాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. భుజం నొప్పి కారణంగా తొలి రెండు మ్యాచ్‌లలో ఆడలేకపోయిన ఆతిధ్య న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇపుడు పూర్తి ఫిట్నెస్‌తో ఉండడం వల్ల అసాధారణ అనుభవంతో మంగళవారం నాటి ఫైనల్ పోరులో ఆడేందుకు సంసిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే రెండు వనే్డల్లో గెలుపుతో మూడో మ్యాచ్‌లోనూ అదే ఊపుతో ఆడడం ద్వారా పైచేయి సాధించడం ద్వారా పర్యాటక టీమిండియా జట్టును వైట్‌వాష్ చేయాలని న్యూజిలాండ్ ఎదురుచూస్తోంది.