క్రీడాభూమి

బంగ్లాపై 44 పరుగులతో పాక్ గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావల్పిండి, ఫిబ్రవరి 10: బంగ్లాతో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో పాకిస్తాన్ 1-0 ఆధిక్యతను సాధించింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో 44 పరుగులతో విజయం సాధించి బంగ్లాను చిత్తు చేసింది.
బంగ్లా జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో 168 పరుగులకే ఔటైంది. పాకిస్తాన్ పేసర్లు, స్పిన్నర్ల ముందు బంగ్లా ఆటగాళ్లు నిలవలేకపోయారు.
పాక్ బౌలర్లలో అతి చిన్న వయస్కుడు, 16 ఏళ్ల 359 రోజుల వయసు గల ఫాస్ట్‌బౌలర్ నసీమ్ షా జట్టు విజయంలో కీలక భూమిక పోషించి 26 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి టెస్టులో హ్యాట్రిక్ సాధించాడు. తొలి టెస్టులో బంగ్లాదేశ్ 233, 168 పరుగులు చేయగా, పాకిస్తాన్ 445 పరుగులు చేసింది. ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్టు రెండు నెలల వ్యవధిలో అంటే ఏప్రిల్ 5 నుంచి 9 తేదీల మధ్య కరాచీలో జరుగుతుంది. కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టులో విజయం సాధించడం ద్వారా పాకిస్తాన్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో 60 పాయింట్లు తమ ఖాతాలో జమ చేసుకుని పాయింట్ల పట్టికలో 140 పాయింట్లకు చేరుకుంది. కాగా, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో 360 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా (246), ఇంగ్లాండ్ (146) ఉన్నాయి.