క్రీడాభూమి

అండర్-19లో గెలుపుతో జట్టుకు ఘన సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, ఫిబ్రవరి 10: ఐసీసీ నిర్వహించిన అన్ని స్థాయిల్లోని మ్యాచ్‌లలో అద్భుత ప్రదర్శన కనబరచడం ద్వారా అండర్-19లో తొలిసారిగా ప్రపంచ కప్‌ను కైవసం చేసుకున్న తమ జట్టు సభ్యులకు ప్రజల సమక్షంలో ఘన సత్కారం చేయాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆదివారం జరిగిన అండర్-19 ఫైనల్ పోరులో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌ను మట్టి కరిపించడం ద్వారా దేశ చరిత్రలో తొలిసారిగా ప్రపంచ కప్ టైటిల్‌ను తీసుకువచ్చిన జట్టుకు ప్రజల సమక్షంలో ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, బంగ్లా టీమ్ స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు స్థానిక ‘డైలీ స్టార్’ దినపత్రిక పేర్కొంది. ప్రధానమంత్రి షేక్ హసీనా అధ్యక్షతన గల కేబినెట్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నట్టు తెలిపింది.