క్రీడాభూమి

బంగ్లా ఆటగాళ్ల తీరు జుగుప్సాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోచెఫ్‌స్ట్రూమ్, ఫిబ్రవరి 10: అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరు జుగుప్సాకరంగా ఉందని భారత జట్టు కెప్టెన్ ప్రియమ్ గార్గ్ మండిపడ్డాడు. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై విజయం సాధించిన బంగ్లా ఆటగాళ్లు మితిమీరిన స్థాయిలో ప్రవర్తించడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఇందుకు సంబంధించి బంగ్లాదేశ్ కెప్టెన్ అక్బర్ అలీ క్షమాపణ చెప్పినప్పటికీ అసలు ఇలా జరిగి ఉండకూడదన్న అభిప్రాయాన్ని భారత కెప్టెన్ గార్గ్ వ్యక్తం చేశాడు. ‘ఏ ఆటలోనైనా గెలుపు ఓటములు అన్నవి సహజమే. ఒకసారి ఓడిపోవచ్చు. మరోసారి గెలవచ్చు. అంతమాత్రాన గెలిచిన బంగ్లా ఇంత అసహ్యంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు’ అని గార్గ్ అన్నాడు. ఓ పక్క మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే బంగ్లా ఆటగాళ్లు దూకుడుగా వ్యవహరించారని, ప్రతి బౌలింగ్‌కు బంగ్లా పేసర్ షోరిఫుల్ ఇస్లామ్ భారత బ్యాట్స్‌మెన్‌లను కవ్వించే రీతిలో ప్రవర్తించాడు. దాదాపుగా బంగ్లా జట్టు విజయపథానికి చేరుకున్న సమయంలో కూడా షోరిఫుల్ వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. అయితే, ఆ జట్టు కెప్టెన్ అలీ మాత్రం వయసుకు మించిన స్థాయిలో పరిణితి కనబరచి తమ ఆటగాళ్ల తరఫున క్షమాపణ చెప్పాడు. గెలిచినా ఓడినా కూడా ప్రత్యర్థి జట్టు పట్ల హుందాగా, గౌరవ భావంతో వ్యవహరించాలని, ముఖ్యంగా క్రికెట్ అన్నది పెద్ద మనుషుల ఆట కాబట్టి ఈ రకమైన పరిణామాలకు ఎంతమాత్రం ఆస్కారం ఉండకూదని అలీ అన్నాడు.

*చిత్రం... భారత్-19 కెప్టెన్ ప్రియమ్ గార్గ్