క్రీడాభూమి

బంగ్లాతో తొలి టెస్టులో పాక్ ఇన్నింగ్స్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావల్పిండి, ఫిబ్రవరి 11: బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌ని పాకిస్తాన్ ఇన్నింగ్స్ 44 పరుగుల తేడాతో గెల్చుకుంది. అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థిపై పాక్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 82.5 ఓవర్లలో 233 పరుగులకు ఆలాటైంది. మహమ్మద్ మిథున్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నజ్ముల్ హొస్సేన్ షాంటో 44 పరుగులు చేశాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిదీ 53 పరుగులకు నాలుగు వికెట్లు కూల్చగా, మహమ్మద్ అబ్బాస్, హారిస్ సొహైల్ చెరి రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం పాకిస్తాన్ తన తొలి ఇన్నింగ్స్‌లో 122.5 ఓవర్లు ఆడి, 445 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. బాబర్ ఆజమ్ (143), షాన్ మసూద్ (100) సెంచరీలతో కదం తొక్కితే, అసద్ షఫీక్ (65), హారిస్ సొహైల్ (75) అర్ద శతకాలను నమోదు చేశారు. బంగ్లా బౌలర్లలో అబూ జయేద్, రూబెల్ హొస్సేన్ చెరి మూడు వికెట్లు కూల్చారు. తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులు వెనుకంజలో ఉన్న బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో మరింత దారుణంగా విఫలమైంది. 62.2 ఓవర్లలో 168 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ మోమినుల్ హక్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడంటే, మిగతా వారి బ్యాటింగ్ వైఫల్యాలు ఏ విధంగా కొనసాగాయో అర్థం చేసుకోవచ్చు. యాసిర్ షా, నసీమ్ షా చెరి నాలుగు వికెట్లు పడగొట్టి, బంగ్లాదేశ్‌ను దారుణంగా దెబ్బతీశారు. పాక్ ఇన్నింగ్స్ తేడాతో గెలవడంలో కీలక పాత్ర పోషించారు.