క్రీడాభూమి

రాహుల్ శతకం వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సిరీస్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ జోరును కొనసాగించారు. హామిల్టన్ వనే్డలో 348 పరుగులు
ఛేజించారు. భారత్‌పై వనే్డల్లో కివీస్‌కు అదే అత్యధిక లక్ష్య ఛేదన. ఈ మ్యాచ్‌లో 297 పరుగుల లక్ష్యాన్ని చేరింది. అంతకు ముందు, 2014లో 279 పరుగులు సాధించి విజయభేరి మోగించింది.
వౌంట్ మాంగనుయ్, ఫిబ్రవరి 11: భారత్‌తో మంగళవారం జరిగిన మూడవ, చివరి వనే్డ ఇంటర్నేషనల్‌ను గెల్చుకున్న న్యూజిలాండ్ జట్టు ఈ సిరీస్‌ను 3-0 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్‌కు మారినప్పటికీ, లోకేష్ రాహుల్ అద్భుత ప్రతిభను కనబరిచాడు. కివీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ, శతకాన్ని నమోదు చేశాడు. కానీ, అతని శ్రమ వృథా అయింది. మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలను చవిచూసిన టీమిండియాకు వైట్‌వాష్ తప్పలేదు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 296 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా న్యూజిలాండ్ 47.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఐదు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. ఓపెనర్ హెన్రీ నికోల్స్ 80 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోగా, మరో ఓపెనర్ మార్టిన్ గుప్టిల్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ కూడా అర్ధ శతకాలతో రాణించి, కివీస్ విజయంలో కీలక భూమిక పోషించారు.
టీమిండియా లక్ష్యాన్ని ఛేదించడంలో తడబడుతుందన్న వాస్తవాన్ని గుర్తించిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీనితో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ కేవలం ఎనిమిది పరుగుల వద్ద మాయాంక్ అగర్వాల్ వికెట్‌ను కోల్పోయింది. అతను కేవలం ఒక పరుగు చేసి, కైల్ జమీసన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ తొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద, హమీష్ బెనెట్ బౌలింగ్‌లో జమీసన్‌కు చిక్కాడు. దీనితో 32 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. పరిస్థితిని చక్కదిద్దుతాడని అనుకున్న పృథ్వీ షా 40 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద రనౌటయ్యాడు. శ్రేయాస్ అయ్యర్‌తో అవగాహన లోపించడంతో అతను వికెట్ అప్పగించాడు. ధాటిగా ఆడి, 63 బంతుల్లో, తొమ్మిది ఫోర్ల సాయంతో 62 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్‌ను కొలిన్ డి గ్రాండ్‌హోమ్ క్యాచ్ పట్టగా, జేమ్స్ నీషమ్ పెవిలియన్‌కు పంపాడు. రాహుల్‌తో కలిసి శ్రేయాస్ వందపరుగుల భాగస్వామ్యాన్ని అందించడం విశేషం. అనంతరం మనీష్ పాండేతో కలిసి లోకేష్ రాహుల్ స్కోరుబోర్డును ముందుకు దూకించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. క్రీజ్‌లో నిలదొక్కుకొని, 113 బంతులు ఎదుర్కొని, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 112 పరుగులు చేసిన రాహుల్‌ను జమీసన్ క్యాచ్ పట్టగా హమీష్ బెనెట్ ఔట్ చేశాడు. కాగా, 48 బంతులు ఎదుర్కొని, రెండు ఫోర్ల సాయంతో 42 పరుగులు చేసిన పాండే చివరికి హమీష్ బెనెట్ బౌలింగ్‌లో మిచెల్ సాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 269 పరుగుల వద్ద భారత్ రెండు వికెట్లు కోల్పోవడంతో, మూడు వందల పరుగుల మైలురాయిని దాటడం కష్టసాధ్యంగా కనిపించింది. రవీంద్ర జడేజా, నవ్‌దీప్ సైనీ చెరి 8 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, శార్దూల్ ఠాకూర్ 7 పరుగులు చేసి, హమీష్ బెనెట్ బౌలింగ్‌లో కొలిన్ డి గ్రాండ్‌హోమ్‌కు దొరికాడు. భారత్ 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి, మూడు వందల మైలురాయికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. హమీష్ బెనెట్ 64 పరుగులకు నాలుగు వికెట్లు పడొగట్టి, టీమిండియాను కట్టడి చేశాడు. కేల్ జమీసన్, జేమ్స్ నీషమ్ చెరొక వికెట్ సాధించారు.
ఓపెనర్ల విజృంభణ
భారత్ నిర్దేశించిన 297 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు చక్కటి ఆరంభాన్ని అందించారు. వారి విజృంభణను భారత బౌలర్లు నిలువరించలేకపోయారు. తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించిన తర్వాత మార్టిన్ గుప్టిల్ పెవిలియన్ చేరాడు. 46 బంతుల్లో 66 పరుగులు చేసి, యుజువేంద్ర చాహల్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన గుప్టిల్ స్కోరులో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఫస్ట్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ డేన్ విలియమ్‌సన్ ఆచితూచి ఆడాడు. అయితే, 31 బంతుల్లో 22 పరుగులు చేసిన అతనిని మాయాంక్ అగర్వాల్ క్యాచ్ పట్టగా చాహల్ పెవిలియన్‌కు పంపాడు. ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడిన మాజీ కెప్టెన్ రాస్ టేలర్ చివరి మ్యాచ్‌లో 12 పరుగులకే, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి చిక్కాడు. జట్టుకు గట్టి పునాది వేసిన నికోల్స్ 103 బంతుల్లో, తొమ్మిది ఫోర్ల సాయంతో 80 పరుగులు చేసి, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో లోకేష్ రాహుల్ చక్కటి క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. జేమ్స్ నీషమ్ (19)ను కోహ్లీ క్యాచ్ అందుకోగా, చాహల్ ఔట్ చేస్తే, వికెట్ కీపర్ టామ్ లాథమ్ (34 బంతుల్లో 32 నాటౌట్), కొలిన్ డి గ్రాండ్‌హోమ్ (28 బంతుల్లో 58 నాటౌట్) మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడ్డారు. కివీస్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే, 5 వికెట్లకు 300 పరుగులు చేసి, క్వీన్ స్వీప్ సాధించింది.
యుజువేంద్ర చాహల్ 47 పరుగులకు 3 వికెట్లు పడగొట్టగా, శార్దూల్ ఠాకూర్, రవీం ద్ర జడేజా చెరొక వికెట్ సాధించారు.
*మూడో వనే్డలో పేస్‌తో పోలిస్తే, స్పిన్ విభాగంలోనే ఎకానమీ రేటు (ఓవర్‌కు సగటున ఇచ్చిన పరుగులు) తక్కువగా నమోదైంది. స్పిన్నర్లు మొత్తం 20 ఓవర్లు బౌల్ చేశారు. ఒక మెయిడిన్‌కాగా, 92 పరుగులిచ్చారు. నాలుగు వికెట్లు పడగొట్టారు. వీరి సగటు ఎకానమీ రేటు 4.60. సీమర్లు మొత్తం 27.1 ఓవర్లు బౌల్ చేశారు. ఒక్క మెయిడిన్ కూడా లేదు. ఏకంగా 205 పరుగులిచ్చారు. ఒక్క వికెట్ మాత్రమే పేసర్ల ఖాతాలోకి వెళ్లింది. సగటున వీరు ఓవర్‌కు 7.54 పరుగులిచ్చారు.
*కనీసం మూడు మ్యాచ్‌లు జరిగిన వనే్డ సిరీస్‌లలో టీమిండియా వైట్‌వాష్ వేయించుకోవడం ఇది మూడోసారి. 1983-84 సీజన్‌లో వెస్టిండీస్ చేతిలో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-5 తేడాతో చేజార్చుకుంది. తిరిగి అదే జట్టు చేతిలో, 1988-89 సీజన్‌లో 0-5 తేడాతోనే పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు తాజాగా న్యూజిలాండ్ చేతిలో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3 తేడాతో కోల్పోయింది. 2006-07 సీజన్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ 5 మ్యాచ్‌ల వనే్డ సిరీస్ ఆడింది. 0-4 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. అయతే, ఒక వనే్డ వర్షం కారణంగా రద్దుకావడంతో, ఆ సిరీస్‌లో వైట్‌వాష్ ప్రమాదం నుంచి బయటపడింది.
*
స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: పృథ్వీ షా రనౌట్ 40, మాయాంక్ అగర్వాల్ బీ కేల్ జమీసన్ 1, విరాట్ కోహ్లీ సీ కేల్ జమీసన్ బీ హమీష్ బెనెట్ 9, శ్రేయాస్ అయ్యర్ సీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బీ జేమ్స్ నీషమ్ 62, లోకేష్ రాహుల్ సీ కేల్ జమీసన్ బీ హమీష్ బెనెట్ 112, మనీష్ పాండే సీ సీ మిచెల్ సాంట్నర్ బీ హమీష్ బెనెట్ 42, రవీంద్ర జడేజా 8 నాటౌట్, శార్దూల్ ఠాకూర్ సీ కొలిన్ డి గ్రాండ్‌హోమ్ బీ హమీష్ బెనెట్ 7, నవ్‌దీప్ సైనీ 8 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 7 మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 296.
వికెట్ల పతనం: 1-8, 2-32, 3-62, 4-162, 5-269, 6-269, 7-280.
బౌలింగ్: టిమ్ సౌథీ 9-0-59-1, కేల్ జమీసన్ 10-0-53-1, హమీష్ బెనెట్ 10-1-64-4, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 3-0-10-0, జేమ్స్ నీషమ్ 8-0-50-1, మిచెల్ సాంట్నర్ 10-0-59-0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: మార్టిన్ గుప్టిల్ బీ యుజువేంద్ర చాహల్ 66, హెన్రీ నికోల్స్ సీ లోకేష్ రాహుల్ బీ శార్దూల్ ఠాకూర్ 80, కేన్ విలియమ్‌సన్ సీ మాయాంక్ అగర్వాల్ బీ యుజువేంద్ర చాహల్ 22, రాస్ టేలర్ సీ విరాట్ కోహ్లీ బీ రవీంద్ర జడేజా 12, టామ్ లాథమ్ 32 నాటౌట్, జేమ్స్ నీషమ్ సీ విరాట్ కోహ్లీ బీ యుజువేంద్ర చాహల్ 19, కొలిన్ డి గ్రాండ్‌హోమ్ 58 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 11, మొత్తం (47.1 ఓవర్లలో 5 వికెట్లకు) 300.
వికెట్ల పతనం: 1-106, 2-159, 3-186, 4-189, 5-220.
బౌలింగ్: జస్‌ప్రీత్ బుమ్రా 10-0-50-0, నవ్‌దీప్ సైనీ 8-0-68-0, యుజువేంద్ర చాహల్ 10-1-47-3, శార్దూల్ ఠాకూర్ 9.1-0-87-1, రవీంద్ర జడేజా 10-0-45-1.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: రాస్ టేలర్.
*చిత్రం...ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: హెన్రీ నికోల్స్