క్రీడాభూమి

కోహ్లీనే టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన వనే్డ ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. భారత్ నుంచి కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే ఈ జాబితాలో మొదటి రెండు స్థానాలను దక్కిం చుకున్నారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డ సిరీస్‌లో టీమిండియా 3-0 తేడాతో వైట్‌వాష్‌కు గురైనా సిరీస్‌లో అద్భుతంగా రాణించడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ 869 రేటింగ్ పాయంట్లతో అగ్రస్థానంలో నిలవగా, రోహిత్ శర్మ 855 రేటింగ్ పాయంట్లతో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మూడో స్థానంలో పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్ (829) ఉండగా, భారత్‌తో సొంతగడ్డపై జరిగిన వనే్డ సిరీస్‌లో సెంచరీ, అర్ధ సెంచరీతో రాణించిన సీనియర్ ఆటగాడు రాస్ టేలర్ ఒక స్థానాన్ని మెరుగు పరుచుకొని 828 రేటింగ్ పాయంట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫఫ్ డుప్లెసిస్ (803), డేవిడ్ వార్నర్ (796), క్వింటన్ డికాక్ (782), కేన్ విలియమ్సన్ (773), జో రూట్ (770), ఆరోన్ ఫించ్ (769) టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
రెండో స్థానానికి బుమ్రా..
న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో ఒక్క వికెట్ కూడా తీయని టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. తాజాగా విడుదలైన బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా ఒక స్థానం దిగజారి 719 రేటింగ్ పాయంట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు భారత్ వనే్డ సిరీస్ ఆడని న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 727 రేటింగ్ పాయంట్లతో తొలి స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి బుమ్రా ఒక్కడే బౌలర్ల జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకోగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ముజీబుర్ రహ్మాన్ (701), కగిసో రబద (674), ప్యాట్ కమిన్స్ (673), క్రిస్ వోక్స్ (659), మహ్మద్ అమీర్ (656), మిచెల్ స్టార్క్ (645), మ్యాట్ హెన్రీ (643), లాకీ ఫెర్గూసన్ (638) కొనసాగుతున్నారు.
జడ్డూ ఒక్కడే..
ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే మూడు స్థానాలు మెరుగు పరుచుకొని 246 రేటింగ్ పాయంట్లతో 7వ స్థానంలో నిలిచాడు. అఫ్గానిస్తాన్ ఆటగాడు మహ్మద్ నబీ 301 రేటింగ్ పాయంట్లతో అగ్రస్థానం దక్కించుకోగా, ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్ స 294 రేటింగ్ పాయంట్లతో రెండో స్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ ఆటగాడు ఇమాద్ వసీం 278 పాయంట్లతో మూడో స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా కొలిన్ డీగ్రాండ్ హోం (266), క్రిస్ వోక్స్ (263), రషీద్ ఖాన్ (253), మిచెల్ శాంత్నార్ (241) కొనసాగుతున్నారు. ఇక చాలా రోజు ల తర్వాత జింబాబ్వే నుంచి సికిందర్ రాజా (234), సియాన్ విలియమ్స్ (233) టాప్-10లో చివరి రెండు స్థానాలను దక్కించుకున్నారు. ఇక జట్టు పరంగా చూస్తే టీమిండియా 121 రేటింగ్‌తో 7748 పాయంట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా, తొలి స్థానంలో ఇంగ్లాండ్ నిలిచింది.
*చిత్రం...విరాట్ కోహ్లీ