క్రీడాభూమి

షమీకి మూడు వికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, ఫిబ్రవరి 15: న్యూజిలాండ్ ఎలెవెన్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ రెండో రోజు భారత పేసర్ మహమ్మద్ షమీ చక్కటి ప్రతిభ కనబరచి మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, నవ్‌దీప్ సైనీ తలా రెండేసి వికెట్లు కూల్చడంతో, కివీస్ ఎలెవెన్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 235 (74.2 ఓవర్లు) పరుగులకు ఆలౌటైంది. రచిన్ రవీంద్ర 34, హెన్రీ కూపర్ 40, డెరిల్ మిచెల్ 32, టామ్ బ్రూస్ 31 చొప్పున పరుగులు చేసి, కివీస్‌ను ఆదుకున్నారు. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో చటేశ్వర్ పుజారా, హనుమ విహారీ తప్ప మిగతా వారంతా పెవిలియన్‌కు క్యూ కట్టగా, కివీస్ ఇన్నింగ్స్‌లో బ్యాట్స్‌మెన్ బాధ్యతాయుతంగా ఆడడం గమనార్హం. అంతకు ముందు భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. 28 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టి, రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 59 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసిన ఓపెనర్లు పృథ్వీ షా (35 నాటౌట్), మాయాంక్ అగర్వాల్ (23 నాటౌట్) రెండో ఇన్నింగ్స్‌లో నిలకడగా ఆడడం విశేషం. కాగా, ఈ మ్యాచ్‌కి ఇం కా ఒక రోజే మిగిలి ఉంది.
సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 78.5 ఓవర్లలో 263 ఆలౌట్ (చటేశ్వర్ పుజారా 93, హనుమ విహారీ 101, అజింక్య రహానే 18, స్కాట్ కూగెల్జెన్ 3/40, ఇష్ సోధీ 3/72, జేక్ గిబ్సన్ 2/26).
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 74.2 ఓవర్లలో 235 ఆలౌట్ (రచిన్ రవీంద్ర 34, హెన్రీ కూపర్ 40, టామ్ బ్రూస్ 31, డారిల్ మిచెల్ 32, మహమ్మద్ షమీ 3/17, జస్‌ప్రీత్ బుమ్రా 2/18, ఉమేష్ యాద్ 2/49, నవ్‌దీప్ సైనీ 2/58).
భారత్ రెండో ఇన్నింగ్స్: 7 ఓవర్లలో 59 నోలాస్ (పృథ్వీ షా 35, మాయాంక్ అగర్వాల్ 23).