క్రీడాభూమి

‘యువ భారత్’కు పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరారే, జూన్ 10: జింబాబ్వేతో శనివారం జరిగే తొలి వనే్డ ఇంటర్నేషనల్‌లో టీమిండియాకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయతే, జట్టులోని యువ ఆటగాళ్ల కు ఈ మ్యాచ్ పరీక్షగా నిలవనుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత జట్టు అటు వనే్డ, ఇటు టి-20 ఫార్మెట్స్‌లో విజయాలను నమోదు చేసి, సిరీస్‌లను కైవసం చేసుకుంటుందని నిపుణుల అభిప్రాయం. గణాంకాలు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇంతకు ముందు జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో గెల్చుకుంది. 2010 తర్వాత జింబాబ్వే చేతిలో భారత్ ఒక్క వనే్డ మ్యాచ్‌ని కూడా కోల్పోలేదు. కాగా, గత రెండు సంవత్సరాల కాలంలో జింబాబ్వే కేవలం మూడు వనే్డల్లో మాత్రమే విజయాలను నమోదు చేయగలిగింది. నాలుగు సంవత్సరాల కాలంలో ధోనీ నాయకత్వంలోని భారత జట్టు జింబాబ్వే టూర్‌కు వెళ్లడం ఇది మూడోసారి. ఈసారి భారత జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఆ అవకాశాన్ని జింబాబ్వే ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటుందనేది అనుమానంగానే ఉంది. ఇటీవలే కెప్టెన్ హామిల్టన్ మసకజా, కోచ్ డేవ్ వాట్‌మోర్‌పై జింబాబ్వే క్రికెట్ అధికారులు వేటు వేశారు. ఒకవైపు తక్కువ సంఖ్యలో మ్యాచ్‌లు ఆడడం, మరోవైపు కెప్టెన్, కోచ్ ఉద్వాసనకు గురికావడం జింబాబ్వే జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తున్న అంశాలు. అంతేగాక, జింబాబ్వేతో ఆడిన గత తొమ్మిది మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయాలను సాధించింది. ఆ జట్టు చేతిలో భారత్ చివరిసారి 2010 జూన్ 3న హరారేలో జరిగిన మ్యాచ్‌లో ఓడింది. ఆతర్వాత ఓటమి అన్నదే లేకుండా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. కాగా, గత 11 వనే్డల్లో కేవలం మూడింటిని మాత్రమే జింబాబ్వే తన ఖాతాలో వేసుకుంది. ఇవి కూడా అఫ్గానిస్తాన్‌పై సాధించినవే కావడం గమనార్హం. టెస్టు హోదాగల జట్టుపై విజయాన్ని ఈ జట్టు చివరిసారి నిరుడు హరారేలో సాధించింది. న్యూజిలాండ్‌పై గెలిచిన తర్వాత మళ్లీ అలాంటి ఫీట్‌ను ప్రదర్శించలేకపోయింది.
ప్రస్తుతం భారత జట్టులోని ఆటగాళ్లలో అంబటి రాయుడు జింబాబ్వేపై ఎక్కువ పరుగులు సాధించాడు. అతను ఒక శతకం, మరో అర్ధ శతకంతో, 88 సగటుతో మొత్తం 266 పరుగులు చేశాడు. బౌలింగ్ విభాగానికి వస్తే అక్షర్ పటేల్ అందరి కంటే ఎక్కువగా, మూడు మ్యాచ్‌ల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. జింబాబ్వే తరఫున ఎల్టన్ చిగుంబురా ఒక సెంచరీ, మరో హాఫ్ సెంచరీ సాయంతో మొత్తం 322 పరుగులు చేశాడు. ఆ జట్టులో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లలో ఎవరూ భారత్‌పై ఇన్ని పరుగులను నమోదు చేయలేదు. ఆ సిరీస్‌లో భారత్‌పై సెంచరీ చేసిన ఏకైక బ్యాట్స్‌మన్ కూడా అతనే. ఇలావుంటే, టీమిండియాతో ఇప్పటి వరకూ 60 వనే్డలు ఆడిన జింబాబ్వే పది మ్యాచ్‌లు గెల్చుకోగలిగింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే రాబోయే వనే్డ, టి-20 సిరీస్‌లలో జింబాబ్వేపై టీమిండియా విజయాలను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది. సీనియర్లు విశ్రాంతి తీసుకుంటున్న కారణంగా జట్టులోకి వచ్చిన చాలా మంది యువ ఆటగాళ్లు ఇటీవలే ముగిసిన ఐపిఎల్‌లో రాణించి, మంచి ఫామ్‌లో ఉన్నారు. నిలకడ లేకుండా, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయిన జింబాబ్వేపై ‘యువ భారత్’ విజయం ఖాయమని నిపుణుల అంచనా.
అన్ని విధాలుగా మ్యాచ్‌కి సిద్ధంగా ఉన్న భారత మేనేజ్‌మెంట్ ఇంకా తుది ఆటగాళ్ల జాబితాను ప్రకటించలేదు. తమ సామర్థ్యాన్ని నిరూపించుకొని జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి పోటీపడుతున్న ఆటగాళ్లలో ఎవరికి ఫైనల్ ఎలెవెన్‌లో చోటు దక్కుతుందనేది ఆసక్తిని రేపుతోంది. గ్రేమ్ క్రెమెర్ నాయకత్వంలోని జింబాబ్వేలోనూ ఒకరిద్దరిని మినహాయిస్తే చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేరు. దీనితో స్వదేశంలో ఆడుతున్నప్పటికీ భారత్‌పై ఆధిక్యాన్ని ప్రదర్శించే అవకాశం జింబాబ్వేకు లేదనే చెప్పాలి. ఏ రకంగా చూసినా శనివారం నాటి మ్యాచ్‌లో ధోనీ సేన గెలుపు ఖాయంగా కనిపిస్తున్నది.
భారత కాలమానం ప్రకారం మ్యాచ్ శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు మొదలవుతుంది.