క్రీడాభూమి

పొట్టి ఫార్మాట్‌లో మహిళల ప్రపంచ యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఆధ్వర్యంలో జరిగే మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ జట్టు ఢీ కొంటుంది. మొత్తం పది జట్లు ఈ మెగా ఈవెంట్‌లో టైటిల్ కోసం పోటీపడుతున్నాయి. 2019 ఐసీసీ ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు నేరుగా ఈ టోర్నీకి అర్హత సంపాదించాయి. బంగ్లాదేశ్, థాయిలాండ్ జట్లు క్వాలిఫయర్స్‌లో గెలిచి, మెయిన్ డ్రా చేరాయి. 2009లో మొదలైన మహిళల టీ-20 వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ తొలి విజేతగా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించింది. అయితే, టైటిల్‌ను ఎక్కువ పర్యాయాలు కైవసం చేసుకున్న జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. ఈ జట్టు 2010, 2012, 2014 సంవత్సరాల్లో విజేతగా నిలిచింది. 2016లో వెస్టిండీస్‌కు టైటిల్ దక్కింది. అప్పుడు ఫైనల్లో ఓటమిపాలై కప్‌ను చేజార్చుకున్నప్పటికీ, 2018లో ఆస్ట్రేలియా మరోసారి టైటిల్‌ను సాధించింది. ఆస్ట్రేలియా ఒకసారి, న్యూజిలాండ్ రెండుసార్లు, ఇంగ్లాండ్ మూడు పర్యాయాలు రన్నరప్ ట్రోఫీని అందుకున్నాయి. రౌండ్ రాబిన్ విధానంలో ఈ టోర్నీలో పోటీలను నిర్వహిస్తారు. క్వార్టర్ ఫైనల్స్ స్థాయి నుంచి నాకౌట్ పద్ధతిలో మ్యాచ్‌లు జరుగుతాయి.
మహిళల వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా సూజీ బేట్స్ (న్యూజిలాండ్) రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఆమె ఖాతాలో ఇంత వరకూ 881 పరుగులు ఉన్నాయి. అత్యధిక వికెట్లు పడగొట్టిన ఘనత ఆస్ట్రేలియాకు చెందిన బౌలర్ ఎలిస్ పెర్రీ దక్కించుకుంది. ఆమె మొత్తం 36 వికెట్లు పడగొట్టింది.
*్భరత జట్టు ఇంత వరకూ ఐసీసీ మహిళల టీ-20 వరల్డ్ కప్ టైటిల్‌ను సాధించలేకపోయింది. కనీసం ఫైనల్‌కు చేరుకోలేకపోవడంతో, రన్నరప్ ట్రోఫీ కూడా దక్కలేదు. 2009 నుంచి క్రమం తప్పకుండా ఈ టోర్నమెంట్‌కు హాజరవుతున్నప్పటికీ, భారత మహిళల ఆట తీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం అభిమానులను నిరాశపరుస్తున్నది. 2009, 2010, 2018 సంవత్సరాల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శనతో సెమీస్ వరకూ చేరగలిగింది. కానీ, ఫైనల్ చేరడంలో ఆ మూడు పర్యాయాలు కూడా విఫలమైంది. ఈసారి హర్మన్‌ప్రీత్ కౌర్ సారధ్యంలో ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇవ్వాలన్న పట్టుదలతో భారత జట్టు బరిలోకి దిగుతున్నది.