క్రీడాభూమి

పాయెట్ సూపర్ గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 11: యూరో 2016 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ శుభారంభం చేసింది. దిమిత్రీ పాయెట్ కీలక సమయంలో అద్భుతమైన గోల్ సాధించి రుమేనియాపై ఫ్రాన్స్‌కు విజయాన్ని సాధించిపెట్టాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ ప్రథమార్ధంలో ఫ్రాన్స్ విజృంభణకు రుమేనియా సమర్థంగా అడ్డుకట్ట వేసింది. ఇరు జట్ల ఆటగాళ్లు గోల్స్ కోసం తీవ్ర స్థాయిలో పోటీపడ్డారు. ఒకరి ప్రయత్నాలను మరొకరు అడ్డుకోవడంతో ఫస్ట్ఫా ముగిసే సమయానికి ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ద్వితీయార్ధంలో ఫ్రాన్స్ గోల్‌ను సాధించేందుకు సర్వశక్తులు ఒడ్డింది. 57వ నిమిషంలో ఆలివర్ గిరాండ్ ద్వారా గోల్ లభించడంతో ఊరిపి పీల్చుకుంది. అయితే, ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. 65వ నిమిషంలో బొగ్డాన్ స్టానూ రుమేనియాకు ఈక్వెలైజర్‌ను అందించాడు. ఇరు జట్లు చెరొక గోల్‌తో సమవుజ్జీగా నిలవగా, పోరు మరింత ఉద్ధృతమైంది. స్వదేశంలో, వేలాది మంది అభిమానుల సమక్షంలో మ్యాచ్ ఆడుతున్న ఫ్రాన్స్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేసింది. మ్యాచ్ ముగింపు దశకు చేరుకున్న సమయంలో, పాయెట్ మెరుపు వేగంతో ముందుకు దూసుకెళ్లి సాధించిన గోల్ ఫ్రాన్స్‌ను 2-1 ఆధిక్యంలో నిలబెట్టింది. అనంతరం ఇన్‌జురీ టైమ్‌లో ఈక్వెలైజర్‌ను సాధించడంలో రుమేనియా విఫలంకాగా, అదే తేడాతో ఫ్రాన్స్ గెలిచింది.
వీరాభిమానుల బెడద
యూరో 2016కు వీరాభిమా నుల బెడద తీవ్రం కానుంది. ఇప్పటికే పారిస్ చేరుకున్న ఇంగ్లాండ్, రష్యా అభిమా నులు ప్రత్యర్థి అభిమాను లపై దాడులు చేస్తామని ప్ర కటించడం విశేషం.

చిత్రం దిమిత్రీ పాయెట్