క్రీడాభూమి

విదేశీ లీగ్‌లపై ఓఝా చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవీ ముంబయి, ఫిబ్రవరి 25: విదేశీ లీగ్‌లపై భారత మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓఝా దృష్టి సారిస్తున్నాడు. గత వారం అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన అతను, విదేశాల్లో టీ-20 టోర్నీల్లో ఆడాలని ఉందని చెప్పాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అంగీకరిస్తేనే వెళతానని స్పష్టం చేశాడు. డీవై పాటిల్ టీ-20 కప్‌లో పాల్గొన్న అతను విలేఖరులతో మాట్లాడుతూ, బీసీసీఐ సూచన మేరకే తాను నిర్ణయం తీసుకుంటానని అన్నాడు. తాను జాతీయ జట్టుకు ఆడినప్పుడు, మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం ఎంతగానో ప్రభావితం చేసిందని అన్నాడు. ధోనీ ఎప్పుడూ బౌలర్ల పక్షపాతిగానే ఉంటాడని, వారికి అనుకూలమైన నిర్ణయాలే తీసుకుంటాడని తెలిపాడు. ధోనీ ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తుంటాడని, అందుకే, చాలా మంది బౌలర్లకు అతను మార్గదర్శకుడని ఓఝా వ్యాఖ్యానించాడు. రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి భారత స్పిన్ విభాగాన్ని ఒకప్పుడు శాసించిన ఓఝా 2011లో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో 20 వికెట్లు కూల్చాడు. ఆ మరుసటి సంవత్సరం న్యూజిలాండ్‌పై 13 వికెట్లు సాధించాడు. మొత్తం మీద కెరీర్‌లో 113 టెస్టు వికెట్లు కైవసం చేసుకున్న ఓఝా మరిన్ని ఎక్కువ టెస్టుల్లో ఆడే అవకాశం లభించి ఉంటే బాగుండేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. మరో ప్రశ్నపై స్పందిస్తూ, దేశంలో సమర్థులైన, జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే సత్తావున్న ఎడమచేతి వాటం స్పిన్నర్లు ఐదారుగురు కంటే లేరని అన్నాడు. ఎక్కువ మంది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ల ఆవస్యకత జట్టుకు ఉందని అభిప్రాయపడ్డాడు. తన బౌలింగ్ యాక్షన్‌పై వచ్చిన విమర్శలను ఓఝా తోసిపుచ్చాడు. ఒకవేళ బౌలింగ్ యాక్షన్ సక్రమంగా లేకుంటే, కెరీర్ ప్రారంభంలోనే దానిని మార్చుకోవాలని యువ బౌలర్లకు హితవు పలికాడు.

*చిత్రం...ప్రజ్ఞాన్ ఓఝా