క్రీడాభూమి

ఆసియా చాంపియన్స్ లీగ్ మ్యాచ్‌లు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలాలంపూర్, ఫిబ్రవరి 27: కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యపిస్తున్న నేపథ్యంలో, ఆసియా చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు సంబంధించి ఆరు మ్యాచ్‌లను ఆసియా ఫుట్‌బాల్ కాన్ఫడరేషన్ (ఏఎప్‌సీ) వాయిదా వేసింది. ఈ నిర్ణయం నాలుగు ఇరాన్ క్లబ్‌లపై ప్రభావం చూపుతుంది. ఏఎఫ్‌సీ అధికారులు గురువారం అత్యవసరంగా సమావేశమై, కరోనా వైరస్ వ్యాపిస్తున్న వైనంపై సుదీర్ఘంగా చర్చించారు. వైరస్ గురించి పలు క్లబ్‌లతోపాటు, ఆటగాళ్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో, మ్యాచ్‌లను వాయిదా వేయక తప్పడం లేదని సమావేశం అనంతరం విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వచ్చే నెలలో జరగాల్సిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌కు కూడా ఇదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. వైరస్‌ను కట్టడి చేయకపోతే, క్రీడా షెడ్యూల్స్ ఇదే విధంగా మారిపోవడం ఖాయం.