క్రీడాభూమి

సావిత్రి ఫూలే పుణే వర్సిటీకి మరో మూడు స్వర్ణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనేశ్వర్, ఫిబ్రవరి 27: సావిత్రి ఫూలే పుణే వర్సిటీ ఇక్కడ జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో సావిత్రి ఫూలే పుణే వర్సిటీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నది. గురువారం మరో మూడు స్వర్ణాలను గెల్చుకోవడం ద్వారా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. వెయిట్‌లిఫ్టింగ్‌లో మహేష్ దత్తా అసవాలే, ప్రాజక్తా స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంటే, రెజ్లింగ్‌లో జ్యోతిబా బజరంగ్ అత్కాలే పుణే వర్సిటీకి స్వర్ణాన్ని అందించింది. పుణే వర్సిటీ మొత్తం 13 స్వర్ణాలతో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, పంజాబ్ వర్సిటీ (చండీగఢ్), జైన్ యూనివర్సిటీ (బెంగళూరు) చెరి ఎనిమిది స్వర్ణ పతకాలు సంపాదించి, పుణే వర్సిటీకి పోటీనిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం ఉన్న పుణే ఆధిక్యాన్ని ఈ రెండు వర్సిటీలు అధిగమించే అవకాశాలు చాలా తక్కువే. కాగా, గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఆల్ ఇండియా ఇంటర్ వర్సిటీ చాంపియన్‌షిప్స్‌లో 258 కిలోల బరువునెత్తిన మహేష్ దత్తా ఇప్పుడు స్నాచ్‌లో 123 కిలోలు, క్లీన్ అండ్ జర్క్‌లో 143 కిలోలతో, మొత్తం 266 కిలోల బరువును ఎత్తి స్వర్ణ పతకాన్ని సంపాదించాడు. డోపింగ్ నిబంధనలను పాటించని కారణంగా ఏడాది సస్పెన్షన్‌ను ఎదుర్కొన్న అతను గత ఏడాది సెప్టెంబర్ మాసంలోనే మళ్లీ క్రీయాశీలకంగా వివిధ టోర్నీల్లో పాల్గొంటున్నాడు. ఈపోటీలో మహేష్ దత్తాకు గట్టిపోటీనిచ్చిన జుటూరి కోటేశ్వరావు (కష్ణ యూనివర్సిటీ), మిథిలేష్ సోన్కర్ (హేంచంద్ యాదవ్ వర్సిటీ) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు.