క్రీడాభూమి

పాక్, థాయ్‌లాండ్ మ్యాచ్ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, మార్చి 3: మహిళల టీ-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌లో భాగంగా మంగళవారం పాకిస్తాన్, థాయిలాండ్ జట్ల మధ్య గ్రూప్ ‘బీ’ చివరి గ్రూప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఉదయం వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు, తొలుత బ్యాటింగ్ చేసిన థాయిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. నటాకన్ చాంతమ్ 56 పరుగులతో రాణించింది. నటాయా బూచాథామ్ 44 పరుగులు సాధించింది. అనంతరం ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో భారీ వర్షం కురవడంతో ఔట్ ఫీల్డ్ బురదమయంగా మారింది. వర్షం తగ్గిన తర్వాత కూడా పిచ్ పరిస్థితి ఆటకు అనుకూలంగా లేకపోవడంతో, మ్యాచ్ రద్దయినట్టు ప్రకటించిన అధికారులు ఇరు జట్లకు చెరొక పాయింట్ ఇచ్చారు. దీనితో, ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో థాయిలాండ్ ఖాతా తెరచింది. ఈ గ్రూప్‌లో మంగళవారం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్ల మధ్య జరగాల్సిన చివరి గ్రూప్ మ్యాచ్ ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే రద్దయింది. ఇరు జట్లకు చెరొక పాయింట్ లభించింది. మొత్తం మీద, ఈ గ్రూప్‌లో మొదటి రెండు స్థానాలను సంపాదించిన దక్షిణాఫ్రికా (7 పాయింట్లు), ఇంగ్లాండ్ (6 పాయింట్లు) సెమీస్‌లోకి అడుగుపెట్టాయి. వెస్టిండీస్ (3 పాయింట్లు), పాకిస్తాన్ (3 పాయింట్లు), థాయిలాండ్ (1) ఇంటిదారి పట్టాయి. మొదటి సెమీ ఫైనల్ సిడ్నీ క్రికెట్ మైదానంలో గురువారం భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతుంది. ఆ మ్యాచ్ సాయంత్రం మూడు గంటలకు మొదలవుతుంది. కాగా, రాత్రి 7 గంటల నుంచి అదే మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు రెండో సెమీ ఫైనల్లో ఢీ కొంటాయి. 8వ తేదీన ఫైనల్ మెల్బోర్న్‌లో జరుగుతుంది.