క్రీడాభూమి

సైనా ఫైనల్‌కు.. శ్రీకాంత్ ఇంటికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూన్ 11: ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫైనల్ చేరగా, పురుషుల సింగిల్స్ సెమీస్‌లో కిడాంబి శ్రీకాంత్ ఓటమిపాలై నిష్క్రమించాడు. ప్రపంచ రెండో ర్యాంకర్ ఇహాన్ వాంగ్ (చైనా)తో సెమీ ఫైనల్‌లో తలపడిన సైనా 21-18, 21-12 తేడాతో విజయం సాధించి, ఈ సీజన్‌లో తొలి టైటిల్‌ను అందుకునే దిశగా మరో అడుగు ముందుకేసింది. రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న సమయంలో సైనా మళ్లీ ఫామ్‌లోకి రావడం విశేషం. ఇటీవల కాలంలో కాలి గాయంతో బాధపడుతూ పలు టోర్నీలకు దూరమైంది. మళ్లీ ఫిట్నెస్‌ను సంపాదించిన ఆమె ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ టోర్నీలో ఫైనల్ చేరింది. టైటిల్ కోసం ఆమె సన్ యూను ఢీ కొంటుంది. మరో సెమీ ఫైనల్‌లో సన్ యూ 21-18, 21-19 ఆధిక్యంతో లీ జురుయ్‌పై గెలిచింది. కాగా, పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో శ్రీకాంత్ డెన్మార్క్‌కు చెందిన హన్స్ క్రిస్టియన్ విటింగస్‌తో తలపడి 20-22, 13-21 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. అతను కూడా రియో ఒలింపిక్స్‌లో పోటీపడనున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్‌ను ఓడించిన విటింగస్ ఫైనల్‌లో జీన్ హుయోకిజిన్‌ను ఢీ కొంటాడు. మరో సెమీ ఫైనల్‌లో హుయోకిజిన్ 21-19, 16-21, 21-19 ఆధిక్యంతో ఆంథోనీ సినిసకా గిరిటింగ్‌పై గెలిచి ఫైనల్ చేరాడు.

చిత్రం సైనా నెహ్వాల్