క్రీడాభూమి

ఎలిస్‌కు గాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్బోర్న్, మార్చి 7: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ గాయం కారణంగా ఐసీసీ మహిళల టీ-20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆడలేకపోతున్నది. ఆమెకు త్వరలోనే శస్త్ర చికిత్స జరగనుంది. ఫలితంగా ఆరు నెలల పాటు ఆమె క్రికెట్‌కు దూరమవుతుంది. న్యూజిలాండ్‌తో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో, ఫీల్డ్ చేసిన బంతిని విసరే క్రమంలో ఎలిస్ కుడికాలు కండరాలు బెణికాయి. దీనితో ఆమెను వైద్య పరీక్షలకు తరలించారు. శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు సూచించినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే ఫైనల్‌ను తిలకించిన తర్వాత ఆమె శస్త్ర చికిత్స తేదీ ఖరారు కావచ్చు. శనివారం ఆసీస్ క్రికెటర్ల నెట్ ప్రాక్టీస్‌ను తిలకించిన ఎలిస్ ఆతర్వాత తన ఆరోగ్య పరిస్థితిపై ట్వీట్ చేసింది. వచ్చే వారం శస్త్ర చికిత్స జరిగే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన 29 ఏళ్ల ఎలిస్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో 12 సంవత్సరాల అనుభవం ఉంది. ఆమె జట్టులో లేకపోవడం, ఫైనల్‌లో ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బగానే పేర్కోవాలి.

*చిత్రం...ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ ఎలిస్ పెర్రీ