క్రీడాభూమి

మెస్సీ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, జూన్ 11: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో స్టార్ ఆటగాడు లియోనెల్ మెస్సీ చెలరేగి హ్యాట్రిక్ సాధించగా, పనామాపై 5-0 ఆధిక్యంతో విజయభేరి మోగించిన అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యాన్ని కొనసాగించిన అర్జెంటీనా చివరి వరకూ ప్రత్యర్థికి గోల్ చేసే అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్ ఏడో నిమిషంలోనే నికోలస్ అటామెండీ చేసిన గోల్‌తో అర్జెంటీనా ఖాతా తెరిచింది. ఆతర్వాత అర్జెంటీనా డిఫెన్స్‌కు పరిమితం కావడంతో ప్రథమార్ధం ముగిసే సమయానికి మరో గోల్ నమోదు కాలేదు. ద్వితీయార్ధం ప్రారంభంలోనూ రక్షణాత్మక విధానాన్ని అనుసరించిన అర్జెంటీనా తర్వాత వ్యూహాన్ని మార్చింది. దాడులకు ఉపక్రమించాలన్న నిర్ణయం తీసుకున్న మరుక్షణమే మెస్సీ విజృంభణ ఆరంభమైంది. 68వ నిమిషంలో అతను తన మొదటి గోల్ చేశాడు. 78, 87 నిమిషాల్లో మరో రెండు గోల్స్ సాధించి హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు. 90వ నిమిషంలో సెర్గియో అగెరో చేసిన గోల్‌తో అర్జెంటీనా 5-0 తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఒక్క గోల్ కూడా చేయలేకపోయిన పనామా నిష్క్రమణ ఖరారుకాగా, అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం సంపాదించింది. ఇంకా ఒక గ్రూప్ మ్యాచ్ జరగాల్సి ఉండగానే అర్జెంటీనా క్వార్టర్స్ చేరి సత్తా చాటింది.
బొలివియాపై చిలీ గెలుపు
ఫాక్స్‌బరోలో జరిగిన మ్యాచ్‌లో బొలివియాను చిలీ 2-1 గోల్స్ తేడాతో ఓడించింది. ఆర్టరో విడాల్ రెండు కీలక గోల్స్ చేసి చిలీని విజయపథంలో నడిపాడు. మ్యాచ్ 46వ నిమిషంలో అతను తొలి గోల్ చేయగా, బొలివియాకు జష్మానీ కాంపోస్ ఈక్వెలైజర్‌ను అందించాడు. అనంతరం గోల్స్ చేయడంలో ఇరు జట్లు సఫలం కాలేదు. మ్యాచ్ డ్రాగా ముగియడం ఖాయమనుకుంటున్న సమయంలో, ఇంజురీ టైమ్‌లో విడాల్ రెండో గోల్ చేసి, చిలీని గెలిపించాడు.

chitram హ్యాట్రిక్ చేసిన మెస్సీ