క్రీడాభూమి

టోక్యోలో పతకమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 10: టోక్యో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించడమే తమ లక్ష్యమని భారత హాకీ జట్టు కెప్టెన్ మన్దీప్ సింగ్ అన్నాడు. 2019 సంవత్సరానికి ధన్‌రాజ్ పిళ్లే ఫార్వర్డ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఇటీవల స్వీ కరించిన అతను మంగళవారం పీటీఐతో మాట్లాడుతూ ఒలింపిక్స్‌కు అర్హ త సంపాదించడానికి జట్టు యావత్తు విశేషంగా కృషి చేసిందన్నాడు. సమష్టిగా పోరాడడం వల్లే ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యామని అన్నాడు. టో క్యోలో పతకాన్ని సాధించడం ద్వారా దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామన్నాడు. తాను ఎంతో అభిమానించే గురుతుల్యుడు ధన్‌రాజ్ పిళ్లే చేతుల మీదుగా ఆయన పేరుమీద హాకీ ఇండియా (హెచ్‌ఐ) ప్రకటించిన అవార్డును తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మన్దీప్ చెప్పాడు. ఒ లింపిక్స్‌లో పతకాన్ని సాధిస్తే, ఈ అ వార్డుకు మరింత సార్ధకత చేకూరుతుందని వ్యాఖ్యానించాడు. హెచ్‌ఐ అవార్డుల్లో, ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అ చీవ్‌మెంట్ అవార్డును మాజీ ఆటగా డు హర్బీందర్ సింగ్, అధువ్ బాత్రా ప్లేయర్ ఆఫ్ ఇది ఇయర్ అవార్డును పురుషుల విభాగంలో మన్‌ప్రీత్ సిం గ్, మహిళల విభాగంలో రాణి స్వీకరించారు. రాణికి వరల్డ్ గేమ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించడం విశేషం. రైజింగ్ స్టార్ అవార్డు పురుషుల విభాగంలో వివేక్ సాగర్ ప్రసాద్, మహిళల విభాగంలో లా ల్రెంసియామీ సొంతం చేసుకున్నారు.