క్రీడాభూమి

ఐర్లాండ్ ‘సూపర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ నోయిడా: గ్రేటన్ నోయిడాలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మంగళవారం చివరి వరకూ అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్‌పై ఐర్లాండ్ విజయం సాధించింది. ఇరు జట్లు సమానమైన స్కోరు చేయడంతో మ్యాచ్ ‘టై’ అయింది. ఫలితాన్ని నిర్ణయించడానికి సూపర్ ఓవర్ తప్పలేదు. కెవిన్ ఓ బ్రియా న్ చివరి బంతిలో సిక్సర్ కొట్టి, ఐర్లాండ్‌ను గెలిపించాడు. టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎం చుకున్న ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. అనంతరం అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పో యి సరిగ్గా 142 పరుగులే సాధింది. ఐర్లాం డ్ ఇన్నింగ్స్‌లో గారెత్ డిలానీ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, హారీ టెకర్ 31 పరుగులు చేశాడు. కెవిన్ ఓ బ్రియాన్ 26 పరుగులు సాధించాడు. చివరికి లో సిమీ సింగ్ 12, క్రెగ్ యంగ్ 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అఫ్గాన్ బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 21 పరుగులకు 3, కయా స్ అహ్మద్ 25 పరుగులకు 3 చొప్పు న వికె ట్లు కూల్చారు. మజీబ్ ఉర్ రహ్మాన్, రషీద్ ఖాన్ చెరొక వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం, 143 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్‌కు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (42), ఉస్మాన్ ఘనీ (18) చక్కటి ఆరంభాన్ని ఇచ్చారు. మొదటి వికెట్‌కు 60 పరుగులు జోడించిన ఇద్దరూ ఒకే ఓవర్‌లో ఔట్ కావడంతో అఫ్గాన్ కష్టాల్లో పడింది. కెప్టెన్ అస్గర్ అఫ్గాన్ 32 పరుగులు సాధించినప్పటికీ, మిగతా బ్యాట్స్‌మెన్ అంతగా రాణించలేదు. చివరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు అవసరంకాగా, జాషువా లిటిల్ వేసిన ఆ ఓవర్ మొదటి బంతిలో రషీద్ ఖాన్ సింగిల్ తీశాడు. రెండో బంతిలో రెం డు పరుగులు చేసిన అస్గర్ అఫ్గాన్ మూడో బంతికి ఆండీ బల్బిర్మెల్ క్యాచ్ పట్టగా ఔటయ్యాడు. దీనితో కయాస్ అహ్మద్ క్రీజ్‌లోకి వచ్చాడు. కాగా, స్ట్రయికింగ్‌కు వచ్చిన రషీద్ ఖాన్ ఆడేందుకు వీల్లేకుండా బంతి ని వేసేందుకు ప్రయత్నించిన లిటిల్ దానిని వైడ్‌గా వేశాడు. అఫ్గాన్‌కు ఒక పరుగు, బంతి అదనంగా లభించాయి. వైడ్ కారణంగా తిరిగి నాలుగో బంతిని విసిరిన లిటిల్‌కు ఖాన్ నుంచి దాడి తప్పలేదు. దానిని రషీద్ ఖాన్ సిక్సర్‌గా మార్చాడు. ఐదో బంతిని ఆచితూచి వేయడానికి ప్రయత్నించడంతో మరోసారి వైడ్‌ను సమర్పించుకున్నాడు. తిరిగి లిటిల్ వేసిన ఐదో బంతిని రషీద్ ఖాన్ రక్షణాత్మకంగా ఆడడాడు. ఫలితంగా చివరి బంతిలో అఫ్గాన్ విజయానికి ఐదు పరుగుల దూరంలో నిలిచింది. కానీ, భారీ సిక్సర్‌కు చేసిన ప్రయత్నంలో రషీద్ ఖాన్ విఫలంకాగా, బంతి బౌండరీ లైన్ దాటి, నాలుగు పరుగులు లభించాయి. దీనితో స్కోర్లు సమమైంది. అనంతరం సూపర్ ఓవర్‌లో అఫ్గాన్‌ను ఓడించి సంచలనం సృష్టించింది.
సంక్షిప్త స్కోర్లు
ఐర్లాండ్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 (కెవిన్ ఓ బ్రియాన్ 26, గారెత్ డిలానీ 37, హారీ టెకర్ 31, నవీన్ ఉల్ హక్ 3/21, కయాస్ అహ్మద్ 3/25).
అఫ్గానిస్తాన్: 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 (రహ్మనుల్లా గుర్బాజ్ 42, అస్గర్ అఫ్గాన్ 32, ఉస్మాన్ ఘనీ 18, గారెత్ డిలానీ 2/21, సమీ సింగ్ 2/37).
సూపర్ ఓవర్..
అఫ్గానిస్తాన్: 8 పరుగులు
ఐర్లాండ్: 12 పరుగులు.
*
సూపర్ ఓవర్ సాగిందిలా..
గ్రేటర్ నోయిడా: ఐర్లాండ్ తరఫున సూపర్ ఓవర్‌ను వేసే బాధ్యతను క్రెగ్ యంగ్ స్వీకరించాడు. అఫ్గాన్ తరఫున రహ్మతుల్లా గుర్బాజ్, మహమ్మద్ నబీ బ్యాటింగ్‌కు దిగారు. మొదటి బంతిలో గుర్బాజ్ ఒక పరుగు తీయగా, రెండో బంతిలో నబీ ద్వారా అఫ్గాన్‌కు ఒక పరుగు లభించింది. మూడో బంతిలో గుర్బాజ్ మరో సింగిల్ తీశాడు. నాలుగో బంతిలో నబీ రెండు పరుగులు చేశాడు. ఐదో బంతి లో సింగిల్ లభించింది. చివరి బంతిలో గుర్బాజ్ రెండు పరుగులు సాధించాడు. మొత్తం మీద అఫ్గా న్ బ్యాట్స్‌మెన్‌కు ఒక్క బౌండరీ కూడా కొట్టే అవకాశంవ్వకుండా యంగ్ తన బాధ్యతను సమర్థంగా పోషించాడు. అఫ్గాన్ ఎనిమిది పరుగులే చేయడం తో, ఐర్లాండ్ ముందు స్వల్ప లక్ష్యం ఏర్పడింది.
అఫ్గాన్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించే బాధ్యతను కెవిన్ ఓ బ్రియాన్, పాల్ స్టెర్లింగ్ తీసుకోగా, అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలన స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న రషీద్ ఖాన్ వారిని కట్టడి చేసేందుకు బంతిని అందుకున్నాడు. తొలి బంతిలో ఓ బ్రియాన్ ఓ పరుగు చేయగా, రెండో బంతిలో స్టెర్లింగ్ నాలుగు పరుగులు సాధించాడు. మూడో బంతికి అతనిని రషీద్ ఖాన్ ఔట్ చేశాడు. దీనితో హారీ టెకర్ బ్యాటింగ్‌కు దిగాడు. తాను ఎదుర్కొన్న మొదటి బంతి, ఓవర్‌లో నాలుగో బంతిని ఎదుర్కొన్న టెకర్ ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. తర్వాతి బంతిలో సింగిల్ తీశాడు. దీనితో చివరి బంతిలో విజయానికి మూడు పరుగులు అవసరంకాగా, ఐర్లాండ్‌ను గెలిపించే బాధ్యతను ఓ బ్రియాన్ తన భుజాలపై వేసుకున్నాడు. రషీద్ ఖాన్ పకడ్బందిగా బంతి వేసినప్పటికీ, దానిని సిక్సర్‌గా కొట్టి, ఐర్లాండ్‌ను గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా రహ్మనుల్లా గుర్బాజ్ ఎంపికయ్యాడు.

*చిత్రం... కెవిన్ ఓ బ్రియా న్