క్రీడాభూమి

సఫారీలతో ఢీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మశాల: న్యూజిలాండ్ పర్యటన అనంతరం కోహ్లీ సేన స్వదేశంలో నేటి నుంచి సఫారీలను ఢీకొనబోతోంది. గత పర్యటనలో చేసిన పొరపాట్లను పునరావృతం కానివ్వకుం డా, జట్టును మళ్లీ గాడిన పడేయాలని టీమిండియా భావిస్తుం డగా, దక్షిణాఫ్రికా ఆత్మవి శ్వాసంతో బరిలోకి దిగుతోం ది. ఇటీ వల స్వదేశంలో కంగారులను 3-0 తేడాతో మట్టి కరిపించింది. మరోవైపు సీనియర్ ఆటగాడు డుప్లెసిస్ జట్టులోకి చేరడం సఫారీలకు కొండంత బలం చేకూరినట్లయంది.
గెలిచి తీరాల్సిందే..
న్యూజిలాండ్ పర్యటనలో కోహ్లీసేన టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి మంచి ఫాంలో కనిపించినా, ఆ తర్వాత వనే్డలు, టెస్టుల్లో వైట్‌వాష్‌కు గురైంది. ముఖ్యంగా ఈ సిరీస్ భారత్ అ న్ని విభాగాల్లో పేలవ ప్రదర్శన చేసింది. టెస్టులు, వనే్డల్లో చెలరేగే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సీరిస్‌లో ఆందోళన కలిగిస్తోం ది. అయతే గత పొరపాట్లను సరిదిద్దుకొని దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో రాణిస్తే భారత్‌కు తిరుగుండదు. మరోవైపు చాలా రోజుల తర్వాత జట్టులోకి ఓపెనర్ శిఖర్ ధావన్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి చేరడం కొంత ఊరటనిచ్చే విషయమే అయనా, బుమ్రా విష యంతో పొలిస్తే సగటు అభిమానిని కలవరపాటుకు గురిచే స్తోంది. బుమ్రా సైతం గాయం నుంచి కోలుకొని తిరిగి వచ్చాక మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాడు. ముఖ్యంగా కివీస్ పర్యటనలో వికెట్లు తీసేందుకు చాలా కష్టపడిన విషయం తెలిసిందే. అయతే ధావన్, భువి ఆటతీరు ఎలా ఉన్నా, ఇటీవల జరిగిన దేశవాళీ టోర్నీలో పాండ్యా చెలరేగి ఆడడం కలిసొచ్చే అంశమే. మరోవైపు రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ లేకపోవ డం కూడా జట్టుకు ఇబ్బంది కలిగించే అంశమే అయనా, పృథ్వీ షా, రోహిత్‌తో కలిసి ఏ మేరకు ఆకట్టుకుంటాడో చూడాలి. అయతే ఓపెనింగ్ విషయంలోనూ ఇప్పటికీ స్పష్టత లేకుండా పోయంది. ధావన్‌తో కలిసి షా , రాహుల్‌లో ఎవరనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఓపెనర్లుగా ధావన్, పృథ్వీషా వస్తే మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, నాలుగో స్థానంలో శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత స్థానాల్లో కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లలో ఎవరస్తారనేది తుది జట్టును బట్టి తెలియనుంది. ఇక బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు భువనేశ్వర్ కుమార్, నవదీప్ సైనీ, హార్దిక్ పాండ్యా పేస్ విభాగంలో ఉండగా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్లుగా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశముంది.
గత సీన్ రిపీట్ అయ్యేనా..
ఇదిలాఉంటే దక్షిణాఫ్రికాతో గత సిరీస్‌లో టీమిండియా మంచి ఆట తీరు ప్రదర్శించింది. టీ20, టెస్టు సిరీస్‌లను కైవ సం చేసుకున్న విషయం తెలిసిందే. అయతే నేటి నుంచి జరిగే వనే్డ సిరీస్‌ను సైతం గత సీన్ రిపీట్ చేయాలని కోహ్లీ సేన భావి స్తోంది. అయతే దక్షిణాఫ్రికా మాత్రం గత జట్టులా లేకపోవడం విశేషం. ప్రస్తుతం సఫారీ జట్టులో చాలా మార్పులు చోటు చేసుకున్నాయ. ఇటీవల స్వదేశంలో బలమైన ఆస్ట్రేలియాను వనే్డ సిరీస్‌లో 3-0 తేడాతో మట్టికరి పించి, తామెంతా ప్రమాదకర జట్టో చూపించింది. ప్రస్తుతం ఆ జట్టులో ఓపెనర్ మలన్‌తో పాటు హెన్రిచ్ క్లాసెన్, వెర్రినె్న, డేవి డ్ మిల్లర్, కెప్టెన్ క్వింటన్ డికాక్ అద్భుత ఫాంలో ఉండగా, వీరికి తోడు డుప్లెసిస్ జత కలవడంతో దక్షిణాఫ్రికా బలం రెట్టింపయంది.
జట్ల వివరాలు..
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, పృథ్వీ షా, కేఎల్ రాహుల్, మనీష్ పాండే, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, కుల్దీప్ యాదవ్, శుభ్‌మన్ గిల్.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్ (కెప్టెన్), టెంబ బవుమా, రస్సే వన్ డర్ డుస్సెన్, ఫఫ్ డుప్లెసిస్, కైల్ వెర్రినె్న, హెన్రిచ్ క్లాసెన్, జానె్నమన్ మలన్, డేవిడ్ మిల్లర్, జాన్-జాన్ స్ముట్స్, అండిలె ఫెహ్లుక్వాయో, లుంగి ఎంగిడి, లుతో సిపమ్లా, బ్యూరన్ హెండ్రి క్స్, అన్రిచ్ నోర్జె, జార్జ్ లిండే, కేశవ్ మహారాజ్.
మరోవైపు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్-దక్షిణాఫ్రికా సిరీస్‌కు అడ్డుతగులు తోంది. భారత్‌లో ఇప్పటికే 58కి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, వందల సంఖ్యలో అనుమానితుల శాంపిళ్లను సేకరిస్తున్నారు. దీంతో క్రికెట్ చూసేందుకు అభిమానుల్లో భయం పట్టుకుంది. ఈ కారణంగానే దాదా పు 22000 సామర్థ్యమున్నా ధర్మశాల స్టేడియంలో ఇప్పటి వరకు కేవలం పావు వంతు టికెట్లు కూడా అమ్ముడు పోలేదని హిమచల్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) పేర్కొంది. ఇదిలాఉంటే నేడు జరిగే మొదటి వనే్డకు వర్షం అంతరాయం కలిగించే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

*చిత్రం...నెట్ ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా క్రికెటర్లు