క్రీడాభూమి

డెంప్సీ కీలక గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫిలడేల్ఫియా, జూన్ 12: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అమెరికా క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. క్లింట్ డెంప్సీ అసాధారణ ప్రతిభ పరాగ్వేపై అమెరికాకు విజయాన్ని సాధించిపెట్టింది. మ్యాచ్ ఆరంభంలో నింపాదిగా ఆడిన యుఎస్ జట్టు క్రమంగా వేగాన్ని పెంచింది. 27వ నిమిషంలో డెంప్సీ మెరుపు వేగంతో దూసుకెళ్లి, పరాగ్వే రక్షణ వలయాన్ని ఛేదించి చక్కటి గోల్ చేశాడు. అనంతరం అమెరికా వ్యూహాత్మకంగా డిఫెన్స్‌కు పరిమితమైంది. పరాగ్వే ఆటగాళ్లు ఎంతగా ప్రయత్నించినా అమెరికా రక్షణ వలయాన్ని ఛేదించలేకపోయారు. చివరికి డెంప్సీ గోల్‌తోనే గెలిచిన అమెరికా క్వార్టర్స్ చేరగా, పరాగ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
కొలంబియాను ఓడించిన ఫాబ్రా!
కొలంబియా ఆటగాడు ఫ్రాంక్ ఫాబ్రా తన జట్టు ఓటమికి కారకుడయ్యాడు. పరాగ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఒక గోల్ చేసి జట్టుకు అండగా నిలిచిన అతను ఒక ఓన్ గోల్‌తో పరాజయానికి పునాది వేశాడు. ఈ మ్యాచ్ రెండో నిమిషంలోనే కోస్టారికాకు జొహాన్ వెనెగాస్ గోల్‌ను అందించగా, మరో ఐదు నిమిషంలోనే కొలంబియా ఆటగాడు ఫ్రాంక్ ఫాబ్రా ఈక్వెలైజర్‌ను సాధించిపెట్టాడు. స్కోర్లు సమమైన ఆనందాన్ని కొలంబియా పూర్తిగా ఆస్వాదించక ముందే ఫాబ్రా పొరపాటున బంతిని తమ గోల్ పోస్టులోకే కొట్టడంతో కొస్టారికా ఖాతాలో రెండో గోల్ చేరింది. సెల్సో బొర్జెస్ 58వ నిమిషంలో సాధించిన గోల్‌తో ఆధిక్యం 3-1కి పెరిగింది. మ్యాచ్ చివరిలో కొలంబియా ఆటగాడు మార్లొస్ మొరెనో ఒక గోల్ చేసినప్పటికీ తన జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. ఫాబ్రా ఓన్ గోల్ నమోదు కాకపోతే, ఈ మ్యాచ్ డ్రాగా ముగిసేది. కానీ, అతని పొరపాటు కొలంబియా పరాజయానికి కారణమైంది. అయితే, ఇప్పటికే క్వార్టర్స్ చేరిన కారణంగా ఆ జట్టుకు ఈమ్యాచ్ ఫలితం వల్ల ఎలాంటి నష్టం లేకపోయింది.

చిత్రం అమెరికాను గెలిపించిన క్లింట్ డెంప్సీ