క్రీడాభూమి

జపాన్ చేతికి ఒలింపిక్ జ్యోతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏథెన్స్: టోక్యో ఒలింపిక్స్ క్రీడా జ్యోతి రిలే సంప్రదాయబద్ధమైన గాన, నృత్యాది కార్యక్రమాల తర్వాత ప్రారంభమైంది. అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) అధికారులు దానిని అధికారికంగా జపాన్ ప్రతినిధికి అందచేయడంతో, రిలే మొదలైంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ అర్టెమిస్ ఇగ్నాటియో సంప్రదాయసిద్ధమైన దుస్తులతో, లాంఛనాలన్నీ పూర్తి చేసుకొని, జ్యోతి అప్పగింత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జపాన్ మాజీ స్విమ్మర్ నవోకో ఇమోటోకు దానిని స్వీకరించారు. దీనితో టోక్యో ఒలింపిక్స్ రిలే అధికారికంగా మొదలైంది. అంతకు ముందు ఈ రిలేకు సంబంధించిన కార్యక్రమం అత్యంత ఆకర్షణీయంగా జరిగింది. అయితే, అతి కొద్ది మంది ప్రముఖులను మినహాయిస్తే, ఈ కార్యక్రమానికి ఎవరినీ అనుమతించలేదు. ప్రేక్షకులు లేకుండానే, సంప్రదాయబద్ధంగా జ్యోతి రిలే ల్యాప్స్ పూర్తయ్యాయి. ఒలింపిక్ జిమ్నాస్టిక్స్ చాంపియన్ లెఫ్టెరిస్ పెట్రోనియాస్ క్రీడాజ్యోతితో ఒక ల్యాప్ పూర్తి చేసిన తర్వాత, దానిని ఒలింపిక్ పోల్‌వాల్ట్ చాంపియన్ కాటెరినా స్ట్ఫోనిదీకి అప్పగించాడు. 1896లో ఆధునిక ఒలింపిక్స్ ప్రారంభమైన పురాతన స్టేడియంలో, పాలరాతి కట్టడాల మధ్య క్రీడా జ్యోతిని జపాన్‌కు అప్పగించే ప్రక్రియ జరిగింది. జ్యోతిని ఇమోటో స్వీకరించి, రిలేను ప్రారంభించింది. 1996 ఏథెన్స్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆమె, ఆ చారిత్రాత్మక నగరంలోనే జ్యోతిని స్వీకరించడం విశేషం. యూనిసెఫ్ ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్న ఆమె ఏథెన్స్‌లోనే ఉంది. కరోనా వైరస్ విజృంభణను దృష్టిలో ఉంచుకొని, విదేశీ ప్రయాణాలపై జపాన్ సర్కారు ఆంక్షలు విధించిన నేపథ్యంలో, జ్యోతిని స్వీకరించే బాధ్యతను ఎవరికి అప్పగించాలని టోక్యో ఒలింపిక్స్ కమిటీ అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. చివరికి ఏథెన్స్‌లోనే ఉన్న ఇమోటో పేరును చివరి క్షణాల్లో ఖరారు చేశారు. నిజానికి ఒలింపిక్ క్రీడా జ్యోతిని వెలిగించే కార్యక్రమం గత వారమే, ప్రేక్షకులు ఎవరూ లేకుండానే ప్రారంభమైంది. గ్రీక్ అధ్యక్షుడు కాథెరీనా సకలారొపౌలూ ప్రత్యేక సందేశంలో శుభాకాంక్షలు తెలపగా, ఐఓసీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా జ్యోతి ప్రజ్వలన, రిలే తదితర కార్యక్రమాలకు ప్రేక్షకులను అనుమతించలేదని అధికారులు ప్రకటించారు. ప్రతిసారీ ఎంతో ఆర్భాటంగా జరిగే ఈ రెండు వేడుకలు ఈసారి నామమాత్రంగా పూర్తయ్యాయంటూ క్రీడాభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్ కమిటీ అధికారులు ఎవరూ ఏథెన్స్‌కు రాలేదు. నిజానికి ఒక దశలో క్రీడా జ్యోతి రిలే ప్రారంభాన్ని రద్దు చేయాలని కూడా వారు అనుకున్నారు. గత వారం జ్యోతి ప్రజ్వల కార్యక్రమానికి హాజరైన హాలీవుడ్ నటుడు గెరార్డ్ బట్లర్‌ను అభిమానులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ సంఘటన కూడా టోక్యో అధికారులు రిలేను రద్దు చేయాలనే ఆలోచనకు పురికొల్పింది. కానీ, ఇమోటో ఏథెన్స్‌లోనే ఉండడంతో ఆమెతో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చివరి క్షణాల్లో నిర్ణయించారు. దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించకపోతే, తర్వాతి కాలంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం కూడా వారిని వెంటాడింది. అందుకే, రిలేను ఎలాంటి ఆర్భాటం లేకుండా పూర్తి చేశారు. ఇలావుంటే, గ్రీస్‌లో కరోనా వైరస్ బారిన పడిన వారిలో ఇప్పటి వరకూ ఆరుగును మృతి చెందారు. పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా, ఒలింపిక్స్ జ్యోతి ప్రజల్వన, రిలే కార్యక్రమాలు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. కానీ, ఐఓసీ అధికారుల చొరవతో ఈ ప్రక్రియ పూర్తయింది. ఒలింపిక్ జ్యోతి రిలే అధికారికంగా మొదలైంది.
*చిత్రం...ఏథెన్స్‌లో గురువారం ఒలింపిక్ జ్యోతిని అధికారికంగా స్వీకరించిన జపాన్ మాజీ స్విమ్మర్ ఇమోటో నవోకో. చిత్రంలో హెలెనిక్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు స్పైరొస్ కాప్రాలస్ కూడా ఉన్నాడు