క్రీడాభూమి

బెల్జియంతో పోరుకు భారత్ సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 12: చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో సోమవారం బెల్జియంతో పోరుకు భారత జట్టు సమాయత్తమవుతున్నది. ఆదివారం విశ్రాంతి దినం కావడంతో, టోర్నీలో పాల్గొంటున్న అన్ని జట్లు ప్రాక్టీస్‌లో, వ్యూహ రచనల్లో మునిగి తేలాయి. టోర్నీ మొదటి మ్యాచ్‌ని జర్మనీతో డ్రా చేసుకున్న భారత జట్టు రెండో మ్యాచ్‌లో గ్రేట్ బ్రిటన్‌ను 2-1 తేడాతో ఓడించి శుభారంభం చేసింది. మొదటి మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఒకానొక దశలో జర్మనీపై 3-1 ఆధిక్యాన్ని సంపాదించినప్పటికీ, చివరిలో గందరగోళపడి, ప్రత్యర్థికి రెండు గోల్స్ సమర్పించుకుంది. అలాంటి పొరపాటు పునరావృతం కాకుండా బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో వ్యూహాత్మకంగా ఆడింది. ఆ మ్యాచ్‌ని గెల్చుకోవడంతో ఇప్పుడు బెల్జియంతో పోరుకు రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమవుతున్నది. రియో ఒలింపిక్స్‌కు ప్రాక్టీస్ ఈవెంట్‌గా జరుగుతున్న ఈ టోర్నీలో గెలిస్తే భారత్ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కాగా, ఇతర మ్యాచ్‌ల్లో బ్రిటన్‌తో దక్షిణ కొరియా, జర్మనీతో ఆస్ట్రేలియా జట్లు ఢీ కొంటాయి.