క్రీడాభూమి

అభిమానుల వీరంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్సెలీ, జూన్ 12: ఫ్రెంచ్ అధికారులు భయపడుతున్నట్టుగానే యూరో కప్ సాకర్ చాంపియన్‌షిప్‌లో అభిమానుల వీరంగం ఆరంభమైంది. ఇంగ్లాండ్, రష్యా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసిన వెంటనే ఇరు జట్ల ఫ్యాన్స్ పరస్పరం దాడులకు దిగారు. రష్యా అభిమానులు కుర్చీలుసహా చేతికి అందిన వస్తువులను విసిరి గలభా సృష్టించారు. ఇంగ్లాండ్ అభిమానులు వారిపై తిరగబడడంతో ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. కొంత మంది గుర్తుతెలియని అభిమానులు స్టేడియంలో ఒక భాగానికి నిప్పుపెట్టారు. పరిస్థితిని అదుపు చేయడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్‌ను ప్రయోగించాయ. ఘర్షణ పడుతున్న వారిని వాటర్ కానన్లతో చెల్లాచెదురు చేశారు. కాగా, ఇరు జట్ల అభిమానులు పదుల సంఖ్యలో గాయపడగా, ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు ప్రకటించారు. మ్యాచ్ ఆరంభం నుంచి ఇంగ్లాండ్, రష్యా జట్లు గోల్స్ కోసం ప్రయత్నించకుండా డిఫెన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చాయి. దీనితో అభిమానుల్లో అసహనం పెరుగుతూ వచ్చింది. ప్రథమార్ధంలో ఒక్క గోల్ కూడా నమోదు కాకపోవడంతో వేలాది మంది కేకలు వేస్తూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ద్వితీయార్ధంలోనూ చాలాసేపు ఇదే పరిస్థితి కొనసాగింది. మ్యాచ్ 73వ నిమిషంలో ఎరిక్ డయర్ చేసిన గోల్‌తో ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ గోల్ నమోదైన వెంటనే రష్యా ఆటగాళ్లను ఇంగ్లాండ్ అభిమానులు హేళన చేశారు. 90 నిమిషాలు ముగిసే వరకూ పరిస్థితిలో మార్పు రాలేదు. అయితే, ఇంజురీ టైమ్ ఆరంభమైన రెండో నిమిషంలోనే వసిలి బెరెట్సెకా అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ గోల్ చేసి, రష్యాకు ఈక్వెలైజర్‌ను అందించాడు. రష్యా అభిమానుల కేరింతల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫైనల్ విజిల్ వినిపించిన మరుక్షణమే పలువురు రష్యా అభిమానులు బారికేడ్లను దాటుకుంటూ ఇంగ్లాండ్ అభిమానుల్లోకి చొరబడి, వారితో ఘర్షణకు దిగినట్టు సిసి టీవీ ఫుటేజీల్లో స్పష్టంగా కనిపించింది. సుమారు వంద మంది రష్యా అభిమానులు ఒక్కసారిగా దాడికి దిగడంతో కొద్దిసేపు దిగ్భ్రాంతిలో ఉన్న ఇంగ్లాండ్ ఫ్యాన్స్ ఆతర్వాత ఎదురుదాడిని ఆరంభించారు. స్టేడియం లోపలేగాక, వెలుపలకు కూడా ఘర్షణ వ్యాపించింది. ఒక వ్యక్తి తలకు బలమైన గాయమైందని, అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, ఐసియులో ఉంచి చికిత్స చేస్తున్నారని అధికారులు ప్రకటించారు. అదే విధంగా 30 మంది వరకు గాయపడ్డారని, వారిని కూడా ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
స్లొవేకియాపై వేల్స్ గెలుపు
స్లొవేకియాతో జరిగిన మ్యాచ్‌లో వేల్స్ 2-1 తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ 10వ నిమిషంలో గారెత్ బాలే చేసిన గోల్‌తో వేల్స్ ఖాతా తెరిచింది. ప్రథమార్ధం ముగిసే వరకూ దాడులకు దిగకుండా రక్షాణాత్మక విధానాన్ని అనుసరించిన వేల్స్ తన ప్రత్యర్థికి గోల్స్ చేసే అవకాశం ఇవ్వలేదు. ద్వితీయార్ధం ఆరంభం నుంచి స్లొవేకియా ఆటగాళ్లు గోల్స్ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేయగా, 61వ నిమిషంలో వారికి ఆండ్రెజ్ డుడా ద్వారా ఈక్వెలైజర్ లభించింది. స్కోరు సమమైన తర్వాత వేల్స్ మళ్లీ గోల్స్ వేటను కొనసాగించింది. 81వ నిమిషంలో హల్ రాబ్సన్ కానూ చేసిన గోల్‌తో 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. మ్యాచ్ ముగిసే వరకు స్లొవేకియాకు గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా ఆదే తేడాతో గెలిచింది.