క్రీడాభూమి

మళ్లీ ఫామ్‌లోకి సైనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జూన్ 12: భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. ఆస్ట్రేలియా ఓపెన్ బాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకొని, ఫిట్నెస్ సమస్యలు తనను వేధించడం లేదని పరోక్షంగా ప్రకటించింది. ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌లో గట్టిపోటీనిస్తానని ఈ హైదరాబాదీ తన విజయంతో సవాలు విసిరింది. ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్, సెమీ ఫైనల్స్‌లో ఇద్దరు ప్రపంచ మాజీ చాంపియన్లను ఓడించి సత్తా చాటింది. క్వార్టర్స్‌లో ఆమె 2013 ప్రపంచ చాంపియన్ రచానొక్ ఇంతనాన్ (్థయిలాండ్)పై విజయం సాధించగా, సెమీస్‌లో చైనాకు చెందిన 2011 వరల్డ్ చాంపియన్‌పై విజయభేరి మోగించింది. 2014లో ఇక్కడ తొలిసారి విజేతగా నిలిచిన సైనా ఫైనల్‌లో చైనాకే చెందిన సన్ యూను 11-21, 21-14, 21-19 ఆధిక్యంతో ఓడించి, ఫిట్నెస్ సమస్యల నుంచి బయటపడిన విషయాన్ని రుజువు చేసుకుంది. సుమారు ఏడాది కాలంగా సైనా కాలి మడమ నొప్పితో బాధపడుతున్నది. ఈ కారణంగానే పలు టోర్నీలకు గైర్హాజరైంది. పాల్గొన్న టోర్నీల్లోనూ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. కొన్ని టోర్నీల్లో ఫైనల్ వరకూ చేరినా టైటిల్ అందుకోవడంలో విఫలమైంది. రియో ఒలింపిక్స్ సమీపిస్తున్న తరుణంలో సైనా వైఫల్యాలు, ఫిట్నెస్ సమస్యలు అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. అయితే, గాయాల సమస్య ఏ మాత్రం లేదని నిరూపించే విధంగా సైనా ఈ టోర్నీలో అసాధారణ ప్రతిభ కనబరచింది. నిరుడు ఢిల్లీలో జరిగిన ఇండియా సూపర్ సిరీస్ తర్వాత ఒక్క టైటిల్‌ను కూడా సాధించలేకపోయిన ఆమె ఈ సీజన్‌లో మొదటిసారి విజేతగా నిలిచి, ఒలింపిక్స్‌లో గట్టిపోటీనిచ్చే సామర్థ్యం తనకు ఉందని నిరూపించుకుంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న సైనా ఈసారి మరింత మెరుగైన స్థానంలో నిలుస్తుందన్న అభిమానుల ఆశలు ఆమె తాజా విజయంతో రెట్టింపయ్యాయి. సన్ యూతో ఆరోసారి తలపడిన సైనా ఆరో విజయాన్ని నమోదు చేయడం ద్వారా ఆమెపై ఆధిపత్యాన్ని మరోసారి రుజువు చేసుకుంది. మొదటి సెట్‌ను కోల్పోయినప్పటికీ ఏ మాత్రం ఒత్తిడికి గురికాకుండా మిగతా రెండు సెట్లలో సైనా దూకుడుగా ఆడడం విశేషం. సిడ్నీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆమె రియో ఒలింపిక్స్‌కు సన్నాహాలను ఆరంభిస్తుంది.
కాగా, పురుషుల సింగిల్స్‌లో హన్స్ క్రిస్టినా విటింగస్ టైటిల్ సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో అతను జియాన్ హుయేక్ జిన్‌ను 21-16, 19-21, 21-11 తేడాతో ఓడించాడు. పురుషుల డబుల్స్ విభాగంలో మార్కస్ ఫెర్నాల్డి గిడియాన్, కెవిన్ సంజయ సుకముజో జోడీ 21-14, 21-15 ఆధిక్యంతో అగ్గా ప్రతమా, రికీ కరాండ సువర్డీ జోడీపై గెలుపొందింది. మహిళల డబుల్స్‌లో బయో ఇజిన్, చెన్ క్విన్‌చెన్ జోడీ ఫైనల్‌లో నిత్య కిషింద మహేశ్వరి, గ్రెసియా పొలీ జోడీని 23-21, 21-17 తేడాతో ఓడించారు. మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో జెంగ్ సివెయ్, చెన్ క్వించెన్ జోడీపై 21-18, 21-14 తేడాతో గెలిచిన లూ కయ్, హువాంగ్ యాక్వియాంగ్ జోడీ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది.
**

ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను సాధించిన సైనాను ప్రధాని నరేంద్ర మోదీ ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బాడ్మింటన్ సంఘం ఆమెకు పది లక్షల నగదు బహుమతిని ప్రకటించింది.

chitram ఆస్ట్రేలియా ఓపెన్ ట్రోఫీతో సైనా నెహ్వాల్