క్రీడాభూమి

మళ్లీ ఫామ్‌లోకి భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 14: భారత హాకీ జట్టు మళ్లీ గా డిలో పడింది. చాంపియన్స్ ట్రోఫీ హాకీలో మం గళవారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన భారత్ 2-1 తేడాతో వి జయం సాధించింది. ఎస్వీ సునీల్ తొలి గోల్ చే సి భారత్ ఆత్మవిశ్వాసాన్ని పెంచితే, సిహెచ్ తి మ్మయ్య కీలక గోల్ చేసి గెలిపించాడు.
బెల్జియం చేతిలో తొలి పరాభవాన్ని సోమవా రం నాటి మ్యాచ్‌లో ఎదుర్కొన్న భారత్ మంగ ళవారం దక్షిణ కొరియాతో పోరును ప్రతిష్ఠాత్మ కంగా స్వీకరించింది. ఎక్కడా పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తపడుతూ సమయానుకూ లంగా ఆడింది. 39వ నిమిషంలో ఎస్వీ సునీల్ భారత్‌కు తొలి గోల్‌ను సాధించిపెట్టాడు. పట్టు దలకు మారుపేరైనా కొరియా ఈక్వెలైజర్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ, భారత రక్షణ వి భాగం వాటిని అడ్డుకుంది. అయతే, 57వ నిమి షంలో కొరియా శ్రమకు ఫలితం దక్కింది. కిమ్ జుహున్ ఆ జట్టుకు ఈక్వెలైజర్‌ను అందించాడు. కానీ, కొరియా ఆనందం క్షణాల్లోనే ఆవిరైంది. మరుక్షణమే సిహెచ్ తిమ్మయ్య గోల్ చేయడం తో భారత్ 2-1 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ గోల్ నమోదైన వెంటనే భారత రక్షణ విభాగం మరోసారి కీలక పాత్ర పోషించింది. కొరియాకు గోల్స్ రాకుండా అడ్డుకుంది. కాగా, ఈ టోర్నీలో భార త్‌కు ఇది రెండో విజయం. మొదటి మ్యాచ్ ని జర్మనీతో డ్రా చేసుకున్న భారత్ రెండో మ్యాచ్ లో బ్రిటన్‌ను ఓడించింది. మూడో మ్యాచ్‌లో బె ల్జియం చేతిలో పరాజయాన్ని ఎదుర్కొంది.

chitram...

భారత్‌కు
తొలి గోల్‌ను అందించిన
ఎస్వీ సునీల్