క్రీడాభూమి

శామ్యూల్స్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బసెటెర్ (సెయింట్ కిట్స్ అండ్ నెవిస్), జూన్ 14: మార్లొన్ శామ్యూల్స్ దూకుడుగా ఆడడంతో ఆస్ట్రేలియాతో జరిగిన ముక్కోణపు వనే్డ క్రికెట్ టోర్నమెంట్‌లో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ నాలుగు వికెట్ల తేడాతో విజయభేరి మోగించింది. 266 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 45.4 ఓవర్లలో, ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఓపెనర్ ఉస్మాన్ ఖాజా 123 బంతుల్లో 98 పరుగులు చేసి అవుటయ్యాడు. రెండు పరుగుల తేడాతో అతను సెంచరీని చేజార్చుకోగా, స్టీవెన్ స్మిత్ (74), జార్జి బెయిలీ (55) కూడా అర్ధ శతకాలు సాధించడంతో ఆస్ట్రేలియా స్కోరు 250 పరుగుల మైలురాయిని అధిగమించగలిగింది. మొదటి ఓవర్‌లోనే ఆరోన్ ఫించ్ (0) వికెట్‌ను కోల్పోయిన ఆస్ట్రేలియాను ముగ్గురు బ్యాట్స్‌మెన్ చేసిన హాఫ్ సెంచరీలు ఆదుకున్నాయి. విండీస్ బౌలర్లలో జాసన్ హోల్డర్, కార్లొస్ బ్రాత్‌వెయిట్, కీరన్ పోలార్డ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
ఆస్ట్రేలియాను ఓడించడానికి 266 పరుగులు సాధించాల్సిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు జాన్సన్ చార్లెస్, ఆండ్రె ఫ్లెచర్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. వీరు తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించాడు. 27 బంతుల్లో 27 పరుగులు చేసిన ఫ్లెచర్‌ను జార్జి బెయిలీ క్యాచ్ అందుకోగా జేమ్స్ ఫాల్క్‌నెర్ అవుట్ చేశాడు. చార్లెస్ 48, డారెన్ బ్రేవో 39, దనేష్ రాందీన్ 29 పరుగులకు పెవిలియన్ చేరగా, శామ్యూల్స్ దూకుడుగా ఆడాడు. ఒకవైపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూనే మరోవైపు అతను పరుగులను రాబట్టాడు. 87 బంతులు ఎదుర్కొన్న అతను ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 92 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. అయితే, అప్పటికే వెస్టిండీస్ స్కోరు 240 పరుగులకు చేరింది. జాసన్ హోల్డర్ సున్నాకే అవుట్‌కాగా, కీరన్ పోలార్డ్ 16, చార్లొస్ బ్రాత్‌వెయిట్ 3 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించారు. వెస్టిండీస్ మరో 38 బంతులు మిగిలి ఉండగానే, ఆరు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసి, నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 7 వికెట్లకు 265 (ఉస్మాన్ ఖాజా 98, స్టీవెన్ స్మిత్ 74, జార్జి బెయిలీ 55, జాసన్ హోల్డర్ 2/44, కార్లొస్ బ్రాత్‌వెయిట్ 2/60, కీరన్ పోలార్డ్ 2/32).
వెస్టిండీస్ ఇన్నింగ్స్: 45.4 ఓవర్లలో 6 వికెట్లకు 266 (జాన్సన్ చార్లెస్ 48, డారెన్ బ్రేవో 39, మార్లొన్ శామ్యూల్స్ 92, నాథన్ కౌల్టర్ నైల్ 2/67, ఆడం జంపా 2/60).