క్రీడాభూమి

కోపా అమెరికా సాకర్ టోర్నీ మెక్సికో, వెనెజులా మ్యాచ్ డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హూస్టన్, జూన్ 14: కోపా అమెరికా సాకర్ చాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో భాగంగా మెక్సికో, వెనెజులా జట్లు తలపడిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు చెరొక గోల్ చేశాయి. మ్యాచ్ పదో నిమిషంలోనే వెనెజులాకు జొస్ మాన్యుయెల్ వెలాక్వెజ్ గోల్‌ను సాధించిపెట్టాడు. ఈ గోల్ నమోదైన వెంటనే వెనెజులా రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంది. దీనితో మెక్సికోకు ఈక్వెలైజర్ సాధించే అవకాశం ప్రధమార్థంలో రాలేదు. ద్వితీయార్ధం ఆరంభంలోనూ వెనెజులా అదే సూత్రాన్ని పాటించింది. అయితే, ఈక్వెలైజర్ కోసం తీవ్రంగా పోరాడింది. చివరికి 80వ నిమిషంలో జీసస్ మాన్యుయెల్ కరోనా కీలక గోల్ చేసి మ్యాచ్ డ్రాగా ముగియడంలో కీలక భూమిక పోషించాడు.
ఉరుగ్వేకు తొలి విజయం
ఈసారి కోపా అమెరికాలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్న ఉరుగ్వే ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. సాంటాక్లారాలో జమైకాతో జరిగిన మ్యాచ్‌ని ఈ జట్టు 3-0 ఆధిక్యంతో గెల్చుకుంది. 21వ నిమిషంలో జేవియర్ హెర్నాండెజ్, 88వ నిమిషంలో మథియాస్ కొరుజో గోల్స్ చేశారు. జమైకా ఆటగాడు జీ వాన్ వాట్సన్ ఓన్ గోల్ చేసి ఉరుగ్వే ఆధిక్యాన్ని పెంచాడు. అదృష్టం కలిసిరాగా, అదనంగా ఒక గోల్ లభించిన ఉరుగ్వే మూడు గోల్స్ తేడాతో విజయం సాధించింది.