క్రీడాభూమి

మోర్గాన్‌కే ఇంగ్లాండ్ పగ్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 14: శ్రీలంకతో జరిగే వనే్డ, టి-20 సిరీస్‌లకు ఇంగ్లాండ్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. లంకతో ఐదు వనే్డలతోపాటు, ఒక టి-20 మ్యాచ్ ఆడనున్న ఇంగ్లాండ్ జట్టులో జానీ బెయిర్‌స్టోకు కూడా అవకాశం దక్కింది. లంకతో ముగిసిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అతను ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును స్వీకరించాడు. వర్షం కారణంగా పలుమార్లు అంతరాయం ఏర్పడిన చివరి, మూడో టెస్టు డ్రాగా ముగిసింది. అయితే, అంతకు ముందే 2-0 ఆధిక్యాన్ని సంపాదించిన ఇంగ్లాండ్ అదే తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. టెస్టు జట్టుకు కెప్టెన్‌గా సేవలు అందించిన అలిస్టర్ కుక్ నిరుడు జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ కంటే ముందు నుంచే వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడలేదు. పరిమిత ఓవర్ల ఫార్మెట్‌లో మోర్గాన్‌కే సెలక్టర్లు పగ్గాలు అప్పగించారు. కాగా, టి-20 మ్యాచ్‌కి ముగ్గురు కొత్త ఆటగాళ్లను ఇంగ్లాండ్ సెలక్టర్లు తీసుకున్నారు. బ్యాట్స్‌మన్ డావిడ్ మలాన్, బౌలర్లు టైమల్ మిల్స్, లియామ్ డాసన్ మొదటిసారి జాతీయ జట్టులో స్థానం సంపాదించారు.

ఇంగ్లాండ్, శ్రీలంక జట్ల మధ్య వనే్డలు ఈనెల 21న ట్రెంట్ బ్రిడ్జిలో, 24న ఎడ్జిబాస్టన్‌లో, 26న బ్రిస్టల్‌లో, 29న ది ఓవల్‌లో, జూలై 2న కార్డ్ఫిలో జరుగుతాయి. ఏకైక టి-20 మ్యాచ్ జూలై ఐదున సౌతాంప్టన్‌లో ఉంటుంది.