క్రీడాభూమి

భారత మహిళల రిలే జట్టు రియో ఆశలు సజీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 14: రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హతను సంపాదించే అవకాశాలను భారత మహిళల రిలే జట్టు సజీవంగా నిలబెట్టుకుంది. ఇటీవల స్లొవేకియాలోని సామోరిన్‌లో జరిగిన పిటిఎస్ అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రీలో జౌనా ముర్ము, అశ్వినీ అక్కున్జీ, అనిల్డా థామస్, ఎంఆర్ పూవమ్మ సభ్యులుగా ఉన్న భారత జట్టు 3:31.39 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. రియో ఒలింపిక్స్‌కు క్వాలిఫై కావడానికి రెండు మార్గాలు ఉంటాయి. నసావూ, బహమాస్‌లో జరిగిన ఐఎఎఎఫ్ ప్రపంచ రిలే ఈవెంట్స్‌లో మొదటి ఎనిమిది స్థానాలను సంపాదించిన జట్లకు నేరుగా ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లభిస్తుంది. వివిధ జాతీయ జట్లు 2015 జనవరి 1 నుంచి 2016 జూలై 11 మధ్య కాలంలో అంతర్జాతీయ ఈవెంట్స్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా మిగతా ఎనిమిది స్థానాలకు జట్లు ఎంపికవుతాయి. బీజింగ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో జిస్నా మాథ్యూ, టింటూ లుకా, దేబశ్రీ మజుందార్, పూవమ్మలతో కూడిన భారత జట్టు అత్యుత్తమంగా 3:29.08 నిమిషాల్లో గమ్యాన్ని చేరింది. రియో ఒలింపిక్స్‌కు కనీస అర్హత 3:30.24 నిమిషాలుకాగా, భారత్ సగటు టైమింగ్ 3:31.39 నిమిషాలు. తదుపరి ఈవెంట్స్‌లో ఏ విధంగా రాణిస్తుందనే అంశంపైనే భారత జట్టు రియో అవకాశాలు ఆధారపడి ఉంటాయి.